మలయాళ ఇండస్ట్రీలో తీవ్రవిషాదం నెలకొంది. నటుడు, దర్శకుడు ప్రతాప్ పోతెన్(70) కన్నుమూశారు. మలయళంతో పాటు తమిళ, తెలుగు, హిందీ భాషల్లో కలిపి 100 సినిమాలకు పైగా నటించాడు. కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడుగా, నిర్మాతగా, స్క్రిప్ట్ రైటర్‌గా పలు విభాగాల్లో పనిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆరవం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ‘తకరా’ సినిమాతో బెస్ట్ యాక్టర్‌గా ఫిలిం ఫేర్ అందుకున్నారు. ‘ఆరోహణం’, ‘పన్నీర్ పుష్పంగళ్’, ‘తన్మాత్ర’, ’22 ఫీమేల్ కొట్టయమ్’, ‘బెంగళూర్ డేస్’ వంటి సినిమాలతో మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ‘ఆకలిరాజ్యం’, ‘కాంచనగంగ’, ‘మరో చరిత్ర’, ‘వీడెవడు’ వంటి సినిమాల్లో నటించాడు. తమిళంలో ‘జీవా’, ‘వెట్రీ విజా’, ‘సీవలపెరి పండీ’, ‘లక్కీ’ మ్యాన్ వంటి సినిమాల్లో నటించాడు.ఇప్పటివరకు ఈయన 12 సినిమాలకు దర్శకత్వం వహించాడు.