సీసీసీ.. కార్మికుల ఆహార‌ భ‌ద్ర‌తే ల‌క్ష్యం- ఎన్ శంక‌ర్

449
ccc
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో క‌రోనా క్రైసిస్ చారిటీ మనకోసం (సీసీసీ) సినీకార్మికుల్ని ఆదుకునేందుకు ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. సీసీసీకి ఇప్ప‌టికే తార‌లు స‌హా ప‌లువురు దాత‌ల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. అలాగే ద‌ర్శ‌క‌నిర్మాత‌ త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ – ద‌ర్శ‌క‌సంఘం అధ్య‌క్షుడు శంక‌ర్ బృందం కార్మికుల‌కు నిత్యావ‌స‌రాల పంపిణీ కోసం న‌డుం కట్టారు. ముందే ప్ర‌క‌టించిన‌ట్టే ఈ ఆదివారం నుంచి 24 శాఖ‌ల కార్మికుల్లో పేద‌ల‌కు స‌రుకుల్ని పంపిణీ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ఎన్.శంక‌ర్ మాట్లాడుతూ- సీసీసీ – మ‌న‌కోసం క‌మిటీ ఛైర్మ‌న్ చిరంజీవి సార‌థ్యంలో క‌మిటీ అద్భుత ఆలోచ‌న చేసి సినీప‌రిశ్ర‌మ‌లో ప్ర‌తి కార్మికుడికి ఇంటికి నెల‌కు స‌రిప‌డా బియ్యం-ప‌ప్పు ఉప్పు గ్రాస‌రీల్ని అందిస్తున్నాం. అందులో భాగంగా స్టూడియోస్ విభాగం కార్పెంట‌ర్ కి స‌రుకులు అందించాం. నేటి నుంచి పంపిణీ కార్య‌క్ర‌మం మొద‌లైంది. నిరంత‌రం సాగే ప్ర‌క్రియ ఇది. ప్ర‌తి కార్మికుడు ధైర్యంగా సీసీసీ మాకు ఆహార‌భ‌ద్ర‌త‌నిస్తుంది అన్న ధైర్యంతో ఉండండి. నెల నెలా మీకు స‌రుకులు ఇంటికే చేర‌తాయి.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య క‌ర్త‌ అయిన మెగాస్టార్ చిరంజీవితో స‌హా దాతలంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. అలాగే ముఖ్యంగా కమిటీ సభ్యులైన తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ బాబు,సి.కళ్యాణ్, దామోదర ప్రసాద్, బెనర్జీ ఇలా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా నాతోటి దర్శకుడైన మెహర్ రమేష్ అందిస్తున్న సహకారం ఎప్పటికీ మర్చిపోలేది“ అన్నారు.

- Advertisement -