ద‌ర్శ‌కుడు మెహర్ రమేష్ ఇంట్లో విషాదం..

16
- Advertisement -

టాలీవుడ్ ద‌ర్శ‌కుడు మెహర్ రమేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రమేష్ సోద‌రి మాదాసు సత్యవతి ఇవాళ ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. మెహర్ రమేష్‌ను ఓదార్చుతూ పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం స్పందించారు. మెహర్ రమేశ్ సోదరి మాదాసు సత్యవతి హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారని తెలిసి ఎంతో బాధపడ్డాను. సత్యవతి ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను అన్నారు.

విజయవాడలోని మాచవరం ప్రాంతంలో వారి కుటుంబం నివసించేది. చదువుకునే రోజుల్లో వేసవి సెలవులు వచ్చినప్పుడు వారి ఇంటికి వెళ్లేవాళ్లం. రమేష్, సత్యవతి మరియు కుటుంబంలోని ఇతర సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా సమయం గడిపిన జ్ఞాపకాలు ఉన్నాయి అని చెప్పారు పవన్. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఎక్స్ వేదికగా వెల్లడించారు.

Also Read:అవయవదానానికి ముందుకు వచ్చిన కేటీఆర్..

- Advertisement -