ప్రస్తుతం వెబ్ సిరీస్ కు మార్కెట్ బాగా పెరిగింది. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు సైతం వెబ్ సిరీస్ ను నిర్మించడానికి ముందుకొస్తున్నాయి. ఇప్పటికే ఆర్కా మీడియా సంస్థ దాదాపు ఏడు కోట్ల పెట్టుబడితో’శివగామి’ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నారు. ఇప్పుడు దర్శకుడు మారుతి కూడా ఇటువైపుగా అడుగులు వేస్తున్నారు. తన దగ్గర పని చేస్తోన్న ఇద్దరు శిష్యులను వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయడానికి నియమించారు. ఈ వెబ్ సిరీస్ కు కథ, మాటలు మారుతి స్వయంగా అందించబోతున్నారు. ఓ కొత్త కాన్సెప్ట్ తో వీటిని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం భారీ బడ్జెట్ నే కేటాయిస్తున్నారని తెలుస్తోంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా స్థాయిలో వెబ్ సిరీస్ ను తెరకెక్కించాలనేది మారుతి ప్లాన్.
ప్రస్తుతం నాగచైతన్యతో ఓ మూవీ తీసేందుకు రెడీ అవుతున్న ఈ దర్శకుడు.. ఇప్పుడు ఓ మాంచి స్క్రిప్ట్ ను డెవలప్ చేస్తున్నాడట. కానీ ఇది డిజిటల్ ప్లాట్ ఫాంకు మాత్రమే సరిపోయే కాన్సెప్ట్. వెబ్ సిరీస్ రూపంలో దీన్ని తెరకెక్కించాలని భావిస్తున్నాడట. కాకపోతే ఈయన డైరెక్షన్ వహించడు. తన అసోసియేట్స్ లో ఎవరో ఒకరి చేతులకు వెబ్ సిరీస్ పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉంది. భారీ బడ్జెట్ తో.. పేరు మోసిన నటులతోనే ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించాలని భావిస్తున్నాడట మారుతి. వీరితో పాటు ఇప్పటివరకూ డిజిటల్ ప్లాట్ ఫాంపై మెరవని తారలను అతిథి పాత్రల్లో చూపించేందుకు కూడా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది. మొత్తానికి డైరెక్టర్ గా తన ప్రతిభ చూపిన మారుతి ఇప్పుడు వెబ్ సిరీస్ రంగంలో కూడా గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు!