రజనీ వల్లే ఆ సినిమా ఫ్లాప్!

121
ks
- Advertisement -

కోలీవుడ్ అగ్రదర్శకుల్లో ఒకరు కేఎస్ రవికుమార్. సినిమా సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ముఖ్యంగా రజనీ – రవికుమార్ కాంబో అంటే హిట్‌కు మారుపేరు. ముత్తు సినిమాతో మొదలైన వీరి అనుబంధం నరసింహ నుండి లింగ సినిమా వరకు సాగింది.

అయితే లింగ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీనిపై రీసెంట్‌గా స్పందించారు రవికుమార్. రజనీకాంత్ చేసిన సూచనలే సినిమాను దెబ్బతీశాయని తెలిపారు. సినిమా షూటింగ్ సమయంలో తాను ఆశించిన అంశాలు లేవని ఆయన అసంతృప్తికి గురయ్యారని ఆయన సూచనలతో మార్పులు చేయగా అది వర్కవుట్ కాలేదన్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద సినిమా బోళ్తా కొట్టిందని తెలిపారు. మరి దీనిపై రజనీ, ఆయన ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి..

- Advertisement -