కృష్ణవంశీ చెత్త సినిమాలేంటో తెలుసా..

298
- Advertisement -

తెలుగులో ఉన్న ప్రతిభావంతులైన దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. క్రియేటీవ్ దర్శకుడిగా కృష్ణవంశీకి మంచి పేరుంది. తొలి సినిమా గులాబి తోనే పరిశ్రమ దృష్టిని ఆకర్షించాడాయన. ఆ తర్వాత ఆయన తీసిన సింధూరం, నిన్నే పెళ్లాడతా, ఖడ్గం, మురారి, చందమామ వంటి సినిమాలు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఇప్పటివరకు కృష్ణవంశీ 19 సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇందులో ఆయనకు చందమామ సినిమా ఫేవరేట్ అట.నేను తీసిన వాటిలో నాకు చాలా నచ్చినది చందమామ సినిమానే. మిగిలినవీ నాకు నచ్చినా.. పూర్తి సంతృప్తి ఇచ్చినది మాత్రం ఆ సినిమాయే అంటూ చెప్పుకొచ్చాడు కృష్ణవంశీ.

Director  Krishna Vamsi

 అలాగే డేంజర్‌ అనుకున్నంత విజయం సాధించలేకపోయినా.. అది కూడా వంశీకి ఇష్టమైన మూవీ అట. ఇక, తాను తీసినవాటిలో అత్యంత చెత్త సినిమా మొగుడు అని చెప్పారాయన. షూటింగ్‌ సమయంలోనే తనకు ఆ విషయం తెలిసిపోయిందట. అయితే ఒకరు మోసం చేయడం వల్ల ఆ సినిమా చేయాల్సి వచ్చిందట. అలాగే పైసా సినిమా కూడా తన వరస్ట్‌ సినిమాల్లో ఒకటని కృష్ణవంశీ ఓపెన్‌గా చెప్పుకొచ్చాడు.

 అ Krishna Vamsi లాగే డేంజర్‌ అనుకున్నంత విజయం సాధించలేకపోయినా.. అది కూడా వంశీకి ఇష్టమైన మూవీ అట. ఇక, తాను తీసినవాటిలో అత్యంత చెత్త సినిమా మొగుడు అని చెప్పారాయన. షూటింగ్‌ సమయంలోనే తనకు ఆ విషయం తెలిసిపోయిందట. అయితే ఒకరు మోసం చేయడం వల్ల ఆ సినిమా చేయాల్సి వచ్చిందట. అలాగే పైసా సినిమా కూడా తన వరస్ట్‌ సినిమాల్లో ఒకటని కృష్ణవంశీ ఓపెన్‌గా చెప్పుకొచ్చాడు.

ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలను అందించిన ఈ దర్శకుడు ప్రస్తుతం ఫ్లాప్‌ల్లో ఉన్నాడు. ఫైసా, మొగుడు, గోవిందుడు అందరివాడేలే సినిమాలు వరుసగా పరాజయం పాలైయ్యాయి. ప్రస్తుతం సందీప్ కిషన్‌, రెజీనా, సాయి ధరమ్ తేజ్‌తో నక్షత్రం అనే సినిమా చేస్తున్నాడు. మరి సినిమాతోనైనా మునపటి గ్రేస్‌ను చూపిస్తాడో లేదో చూడాలి.

 Krishna Vamsi

- Advertisement -