చరిత్రగలిగిన సినిమాలు తీస్తూ టాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ క్రిష్. తిసినవి తక్కువ సినిమాలే అయిన ఆయన తిసిన ప్రతిసినిమాకు జాతీయ స్ధాయిలో మంచి గుర్తింపు రావడమే కాకుండా అవార్డులు కూడా వచ్చాయి. ఇటివలే నందమూరి బాలకృష్ణతో తీసిన గౌతమిపుత్ర శాతకర్ణితో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు. వైవిద్యభరితమైన సినిమాలు తీస్తూ టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నాడు క్రిష్.
ఇక క్రిష్ కు సంబంధించి మరో వార్త సంచలనం రేపుతోంది. ఆయన భార్య రమ్యతో విడుకులు తీసుకోవడానికి సద్దమయ్యాడు క్రిష్. ఇటివలే ఆయన విడాకులకు దరఖాస్తూ చేసినట్టు తెలుస్తుంది. 2016, ఆగస్టు 7వ తేదిన వీరి వివాహం జరిగింది. క్రిష్ విడాకులు తీసుకోవడానికి ఓ నటితో డేటింగ్ చేయడమే కారణమనే రూమర్ ప్రచారంలో ఉంది. క్రిష్ డైరెక్షన్లోనే ఆ హీరోయిన్ ఓ హిట్ చిత్రంలో నటించిందని చెబుతున్నారు. క్రిష్ పెళ్లయ్యాక కూడా వీరి అనుబంధం కొనసాగుతోందని, అందుకే రమ్య విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
అంగరంగవైభవంగా జరిగిన విళ్ల పెళ్లికి టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయిన విషయం తెలిసిందే. అయితే క్రిష్ భార్య రమ్య అంగీకారంతోనే ఇరువురు కలిసి విడాకుల కోసం దరఖస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. విరిద్దరి మధ్య పరస్పరం జరగుతున్న గొడవల కారణంగానే వారు ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా విరిద్దిర వేరు వేరుగా ఉంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం క్రిష్ మణికర్ణిక అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ కు కూడా దర్శకత్వం వహించననున్నట్లు ఇటివలే ప్రకటించిన విషయం తెలిసిందే.