రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 14 Reels plus ఎంటర్టైన్మెంట్ నిర్మాతల్లో ఒకరైన గోపి ఆచంట ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మణికోండ లో మొక్కలు నాటిన శ్రీకారం సినిమా డైరెక్టర్ బి కిషోర్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటడం జరిగింది అని వాటిని సంరక్షించే బాధ్యత నాదే అని తెలిపారు.ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మరికోందరికి రామ్ ఆచంట (14 Reels plus నిర్మాతల్లో ఒకరు); ప్రియాంక అరుల్ మోహన్ (శ్రీకారం సినిమా హీరోయిన్) ; DOP యువరాజ్ ;మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్; ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.