నాగార్జున, నాగ చైతన్య నటించిన బంగార్రాజు
తో సంక్రాంతి బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన తదుపరి చిత్రం అగ్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్లో చేయనున్నారు. కెఇ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రానికి నిర్మాత. దక్షిణాది చలనచిత్ర రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన స్టూడియో గ్రీన్, స్టార్ హీరోలతో హై బడ్జెట్ ఎంటర్టైనర్లను నిర్మించడమే కాకుండా కంటెంట్ రిచ్ సినిమాలను నిర్మిస్తోంది. తెలుగులో కూడా అంతే ప్రజాదరణ పొందిన ఈ బ్యానర్‌పై నిర్మించిన పలు చిత్రాలు ఇక్కడ డబ్ చేసి విడుదలయ్యాయి.
ఈ సందర్భంగా కెఇ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ, సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో మా బేనర్లో భారీ సినిమా చేయనున్న విషయాన్ని సంతోషంగా ప్రకటిస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నామని తెలిపారు. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లను రూపొందించడంలో పేరుగాంచిన కళ్యాణ్ కృష్ణ, బంగార్రాజుతో ఒక ఆదర్శవంతమైన సంక్రాంతి సినిమాతో వచ్చినందుకు ప్రశంసలు అందుకున్నాడు, ఇది భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సంబందించిన ఇతర వివరాలు త్వరలో స్టూడియో గ్రీన్ వారు వెల్లడించనున్నారు.