కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు..

88
- Advertisement -

టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం లెజెండరీ నటి జమునా కన్నుమూయగా తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళాతపస్వి కె. విశ్వనాథ్‌ కన్నుమూశారు. ఆయన వయస్సు 92. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం అర్థరాత్రి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. విశ్వనాథ్ మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.

విశ్వనాథ్ పూర్తిపేరు.. కాశీనాథుని విశ్వనాథ్. 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. వాహిని స్టూడియోస్‌లో సౌండ్‌ ఆర్టిస్టుగా సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన సిరిసిరి మువ్వ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

టాలీవుడ్‌కి ఎన్నో అపురూపమైన చిత్రాలను అందించారు విశ్వనాథ్. తెలుగు చిత్రపరిశ్రమలో దిగ్గజ దర్శకుల్లో ఒకరు. 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. శంకరాభరణం ఇండస్ట్రీలో చరిత్ర సృష్టించింది. తర్వాత సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం ,సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి ఎవర్‌ గ్రీన్ సినిమాలను తీశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -