నా అభిమానిగా సీఎం కేసీఆర్ నా ఇంటికి వచ్చారుః కె. విశ్వనాథ్

670
Cm Kcr Meet K. Vishawanath
- Advertisement -

నా అభిమానిగానే కేసీఆర్ మా ఇంటికి వచ్చారన్నారు కళాతపస్వీ, సినియర్ దర్శకుడు కె. విశ్వనాథ్. ఫిలిం నగర్ లోని దర్శకుడు కె.విశ్వనాథ్ ను ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం కేసీఆర్. కేసీఆర్ తో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పలువురు అధికారులు ఉన్నారు.

విశ్వనాథ్ ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లే ఆయన్ని కలిసేందుకు కేసీఆర్ వెళ్లారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే వాటన్నింటికి తిప్పికొట్టేందుకు కాసేపటి క్రితం మీడియా సమావేశం నిర్వహించారు దర్శకుడు కె. విశ్వనాథ్. సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగానే మా ఇంటికి వచ్చారు. నేను ఎలాంటి అనారోగ్యంగా బాధపడటం లేదన్నారు.

సినిమాలో పాట నచ్చి నన్ను కలుస్తా అని నిన్న రాత్రి ఫోన్ చేసి మాట్లాడారన్నారు. సీఎం కేసీఆర్ నా ఇంటికి రావడం అంటే శ్రీ కృష్ణుడు కుచేలుడు ఇంటికి వచ్చినట్లుగా ఉంది అన్నారు. చాలా మంది తనను సినిమాలు తీయమంటున్నారు…కానీ తనకు ఓపిక లేదని చెప్పారు. కేసీఆర్ సాహిత్య అభిరుచిన తనతో పంచుకున్నట్లు తెలిపారు.

- Advertisement -