రైతు బంధు చెక్కును తిరిగి ఇచ్చేసిన డైరెక్టర్

280
harish shankar
- Advertisement -

మే 10 న ప్రారంభమైన రైతు బంధు స్కీమ్ రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. కొంతమంది తమకు వచ్చిన చెక్కులను తిరిగి ప్రభుత్వానికి లేదంటే రైతు సమన్వయ సమితులకు విరాళంగా ఇచ్చేస్తూ తమ ఉదారతను చాటుతున్నారు. వారిలో సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకులు, ఉద్యోగులు కూడా ఉన్నారు. తాజాగా సినీ దర్శకుడు హరీష్ శంకర్ కూడా తనకు ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు చెక్కును తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేశారు.

Director-Harish-Shankar-Participates-in-Raithu-Bandhu-Program-225x300

కమ్మదనం గ్రామం లో తనకు ఉన్న భూమికి గాను ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధు పధకం ఫలాన్ని ఎవరన్నా పేద రైతు సహయార్ధం వాడమని తిరిగి ఇచ్చేసారు. స్థానిక MLA సమక్షంలో గ్రామ సర్పంచ్ కి అందచేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పధకం ఎంతో ఉన్నతమైందని, దీని ఫలితం గా నాకు ఉన్న పొలానికి కూడా కొంత మొత్తం వచ్చింది. ఎవరన్నా పేద రైతు సహయార్ధం ఇది వాడితే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశము తో ఈ మొత్తానికి మరికొంత జోడించి నేను సర్పంచ్ గారికి బాధ్యతాయుతం గా అందచేస్తున్నానని అన్నారు హరీష్ శంకర్.

- Advertisement -