2 నిమిషాలకే ‘సెహరి’ ప్రపంచంలోకి వెళ్తారు- దర్శకుడు

64
- Advertisement -

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా ‘సెహరి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జ్ఞానశేఖర్‌ ద్వారక. వర్గో పిక్చర్స్‌ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హ‌ర్ష్ క‌నుమిల్లి ఈ చిత్రానికి క‌థా ర‌చ‌యితగా వ్య‌వ‌హ‌రించారు. ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 11న గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌నున్నారు. ఈ క్రమంలో దర్శకుడు ద్వారక జ్ఞానశేఖర్‌ మీడియాతో ముచ్చటించారు.

సెహరి అంటే సెలెబ్రేషన్. అన్ని భాషల్లో ఈ పదానికి అర్థం ఉంది. మేం సంస్కృతం నుంచి తీసుకున్నాం. ఓయ్ సినిమాలో పాట వల్ల ఇంకా ఫేమస్ అయింది. నేను గత ఆరేళ్ల నుంచి యాడ్ ఫిల్మ్ మేకింగ్‌లో ఉన్నాను. ఇదే నా మొదటి చిత్రం. అనుకున్న టైంలోనే సినిమాను తీశాం. కానీ ప్యాచ్ వర్క్‌ కాస్త లేట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాస్త ఆలస్యంగా జరిగింది. అందుకే సినిమా రిలీజ్‌ లేట్ అయింది. హీరో హర్ష అందించిన కథతోనే సినిమాను తీశాను. రామ్ కామ్ అని చెప్పడంతో పెద్ద అంచనాలు పెట్టుకుని కథ వినలేదు. కానీ కథ చాలా నచ్చింది. ఆ తరువాత చిన్న చిన్న మార్పులు చేసుకుని ఈ సినిమాను తీశాను. కథ విన్న వెంటనే చేసేస్తాను అని చెప్పాను. ప్రీ ప్రొడక్షన్ కోసమే మూడు నెలలు పని చేశాం అన్నారు.

నాది చిత్తూరులోని పలమనేరు ప్రాంతం. ఎంఎస్సీ చదివాను. ఎవరి దగ్గరా పని చేయలేదు. యాడ్ ప్రొడక్షన్ కంపెనీలో పని చేశాను. దాదాపు 70కి పైగా యాడ్స్ తీశాను. ఇదే నా మొదటి చిత్రం. అందులో ఉన్న అనుభవం వల్లే ఈ సినిమాలో విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. యాడ్ అయితే ముప్పై సెకన్లు ఉంటుంది.. సినిమా అయితే రెండున్నర గంటలు ఉంటుంది. అంతే తేడా. ఇక సినిమాల వరకు అయితే షెడ్యూల్స్‌కు గ్యాప్ వస్తుంది. ఆ మూడ్‌ని అలానే మెయింటైన్ చేయాల్సి వస్తుంది. కానీ యాడ్ షూటింగ్‌లో ఒకటి రెండు రోజుల్లో మొత్తం అయిపోయింది. యాడ్ ఫిల్మ్ మేకింగ్ అనుభవం వల్ల చకచకా సినిమాను తీసేయగలిగాను. లొకేషన్స్ షిప్ట్ చేసుకోగలిగాను. అందరిలో కో ఆర్డినేట్ అవ్వగలిగాను.

నేను రచయితను. కొన్ని కథలు రాసుకున్నాను. నాకు సినిమాల మీదే ఇంట్రెస్ట్. కానీ హర్ష్ ఈ కథ చెప్పినప్పుడు ఎంతో ఫ్రెష్‌గా అనిపించింది. కథ విన్న వెంటనే బాగా నచ్చింది. అందుకే నా కథలు పక్కన పెట్టి ఈ సినిమాను చేశాను. యుక్త వయసులో అబ్బాయి మనస్తత్వం, ప్రేమ, బ్రేకప్ వంటి అంశాల మీద తెరకెక్కించాం. రెండున్నర గంటలు సినిమా అద్భుతంగా ఉంటుంది. సినిమా ప్రారంభమైన రెండు నిమిషాలకే సెహరి ప్రపంచంలోకి వెళ్తారు. థియేటర్ల నుంచి బయటకు వచ్చే సరికి అందరి మొహాల మీద చిరునవ్వు ఉంటుంది.

సెహరి టైటిల్ మీద చాలా చర్చించుకున్నాం. తెలిసిన వాళ్లందరికీ చెప్పాం. నిర్మాతతో కూడా చాలా చర్చించాం. సెహరి ఫస్ట్ లుక్ వచ్చిన తరువాత అందరూ దాని గురించి మాట్లాడారు. ఇంత మంచి టైటిల్ ఎలా దొరికిందని అడిగారు. అందరికీ అంత నచ్చిందన్నమాట. పదం తెలుసు. కానీ సెహరి అర్థం మాత్రం ఎవ్వరికీ తెలియదు. అందుకే ట్రైలర్‌లో చెప్పాను. నిర్మాత అద్వయకు సొంత సోదరుడు ఉంటే ఎలా సపోర్ట్ చేశారో అంతగా మమ్మల్ని సపోర్ట్ చేశారు. తన సొంత బ్రదర్‌ను లాంచ్ చేసినట్టుగా మమ్మల్ని చూసుకున్నారు. నేను కూడా హర్ష్‌ను అలానే చూసుకున్నాను. త్వరలోనే హర్ష్ పెద్ద స్టార్ అవుతాడు. ఆయన ఈజ్, టైమింగ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమా పట్ల ఉన్న ప్యాషన్ కనిపిస్తుంది.

సినిమా బాగా రావాలని ఉంటుంది. అందుకోసం ఈ కథకు కొన్ని మార్పులు చెప్పాను. హర్ష్ కూడా ఒప్పుకున్నాడు. మా నిర్మాత, హీరో, నేనే ఎప్పుడూ సింక్‌లోనే ఉంటాం. షూటింగ్ అంతా కూడా సరదాగా చేసుకుంటూ వెళ్లిపోయాం. మా కెమెరామెన్‌కి కూడా ఇది మొదటి సినిమానే. ఆ విషయంలోనూ నిర్మాత ఎక్కడా అడ్డుచెప్పలేదు. దాని ఫలితమే ఈ రోజు చూస్తున్నాం. సినిమాలో విజువల్స్ అద్బుతంగా వచ్చాయి. ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరూ విజువల్స్‌ బాగున్నాయని అంటున్నారు. రఫ్ కట్ చూసినప్పుడే సినిమా మీద నమ్మకం వచ్చేసింది. ప్రశాంత్ విహారి ఇచ్చిన ఆల్బమ్ అద్భుతంగా వచ్చింది. కోటి గారిని తీసుకుందామని నిర్మాత అద్వయ ముందుకు వచ్చారు. కోటి గారికి 20 నిమిషాలే కథ చెప్పాను. నచ్చడంతో ఆయన మా ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. అప్పటి నుంచి మాతోనే ఉన్నారు.

నాకు తెలుగు సినిమా అంటే. అందరూ దర్శకులు ఇష్టమే. చెప్పాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. త్రివిక్రమ్ గారు వాడే కలర్స్, నిర్మాణ విలువలు చాలా ఇష్టం. నాకు విజువల్స్ అంటే చాలా ఇష్టం. రాజమౌళి గారి విజువల్స్‌ గురించి చెప్పాల్సిన పని లేదు. అలా విజువల్ గ్రాండియర్‌గా ఉంటే నచ్చుతుంది. పీరియడ్ డ్రామా, యాక్షన్ డ్రామా కథలు రెడీగా ఉన్నాయి. హర్ష్‌తో కలిసి యాక్షన్ డ్రామా కథను తెరకెక్కించబోతోన్నాను. సెహరి వల్ల ఈ సినిమా అనౌన్స్మెంట్ ఆలస్యమైంది. సెహరి కోసమే మేం ఇద్దరం కలిశాం. హర్ష్‌కు విజువల్స్ అంటే చాలా ఇష్టం. అభినవ్ గోమటం డేట్స్ గురించి చాలా రోజులు ఎదురు చూశాం. కథ చెప్పిన వెంటనే సిమ్రన్ చౌదరి ఓకే చెప్పారు అని దర్శకుడు జ్ఞానశేఖర్‌ ద్వారక చెప్పుకొచ్చారు.

- Advertisement -