మే 3 వ‌ర‌కు లాక్‌డౌన్‌ను విజ‌య‌వంతం చేద్దాం..

304
Boyapati Srinu
- Advertisement -

ఇదే స్ఫూర్తితో మే 3 వ‌ర‌కు లాక్‌డౌన్‌ను విజ‌య‌వంతం చేద్దామని ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను పిలుపునిచ్చారు. లాక్‌డౌన్ కాలాన్ని మే 3 వ‌ర‌కు పొడిగింపుపై బోయపాటి స్పందించారు. మ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తీసుకున్న నిర్ణ‌యం ఎంతైనా స‌ముచితమే అని ఆయన అన్నారు. కోవిడ్‌-19పై రాజీలేని పోరాటాన్ని కొన‌సాగించ‌డానికి లాక్‌డౌన్ మించిన ఆయుధం లేద‌నేది నిపుణులంతా చెప్తున్న విష‌యం. ఇప్ప‌టివ‌ర‌కు 21 రోజుల లాక్‌డౌన్‌ను దేశంలోని అంద‌రం ఏక‌తాటిపై నిల్చొని విజ‌య‌వంతం చేశాం. అందువ‌ల్లే క‌రోనా వైర‌స్ స‌మాజంలో విరివిగా వ్యాప్తి చెంద‌కుండా అడ్డుకోగ‌లిగామని బోయపాటి అన్నారు.

ఈ రోజు నుంచి మ‌రో 19 రోజుల పాటు అదే స్ఫూర్తితో, స్వీయ నియంత్ర‌ణ‌తో లాక్‌డౌన్‌ను విజ‌య‌వంతం చేసి, త‌ద్వారా కోరానా మ‌హ‌మ్మారిపై పోరాటంలోనూ విజ‌యం సాధించాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నాను. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారిని అరిక‌ట్ట‌డానికి అటు కేంద్ర ప్ర‌భుత్వం, ఇటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు గొప్ప‌గా ప‌నిచేస్తున్నాయి. అహ‌ర్నిశలు అప్ర‌మ‌త్తంగా ఉంటూ, ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తూ చైత‌న్య ప‌రుస్తున్న ప్ర‌భుత్వ యంత్రాంగాల‌కు చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నాను.

క‌రోనా వ్యాప్తిపై పోరాటంలో డాక్ట‌ర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు రేయింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్న తీరుకు శిర‌సువంచి పాదాభివంద‌నం చేస్తున్నా. మ‌న దేశం ఇంత ప్ర‌భావ‌వంతంగా క‌రోనాపై పోరాడుతున్న‌దంటే అందుకు వాళ్లు అద్భుతంగా చేస్తున్న‌ సేవ‌లే ప్ర‌ధాన కార‌ణం. అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా త‌మ వంతు పాత్ర‌ను గొప్ప‌గా పోషిస్తున్నారు.

లాక్‌డౌన్ కార‌ణంగా దేశానికి ఆర్థికంగా తీవ్ర న‌ష్టం వాటిల్లినా, దాని కంటే ప్ర‌జ‌ల ప్రాణాలే గొప్ప‌వ‌ని ప్ర‌ధాని చెప్పిన మాట‌లు ఎంతో విలువైన‌వి. సినిమా ఇండ‌స్ట్రీపై కూడా లాక్‌డౌన్ తీవ్ర ప్ర‌భావం క‌లిగిస్తోంది. ప్ర‌ధానంగా ఉపాధి కోల్పోయిన‌ పేద క‌ళాకారులు, దిన‌స‌రి వేత‌నంతో జీవించే కార్మికులను ఆదుకోవ‌డానికి సినిమా ఇండ‌స్ట్రీ అంతా ఒక్క‌టిగా ముందుకు రావ‌డం ముదావ‌హం.

క‌రోనా వైర‌స్ ఎంత భ‌యాన‌క‌మైన‌దైనా, దాని వ‌ల్ల దేశ‌మంతా ఒక్క‌టేన‌నే భావ‌న ఏర్ప‌డ‌టం, కుల మ‌త భేదం లేకుండా, పేద ధ‌నిక తార‌త‌మ్యం లేకుండా అంద‌రం ఐక‌మ‌త్యం ప్ర‌ద‌ర్శించ‌డం గొప్ప విష‌యం. ఇదే స్ఫూర్తితో మే 3 వ‌ర‌కు కొన‌సాగ‌నున్న లాక్‌డౌన్‌ను విజ‌య‌వంతం చేద్దాం. అంద‌రం ఇళ్ల‌ల్లో ఉండి ప్ర‌భుత్వాల‌కు, పోలీసుల‌కు పూర్తిగా స‌హ‌క‌రిద్దాం. ఇంట్లో ఉందాం, క్షేమంగా ఉందాం. అని దర్శకుడు బోయపాటి పేర్కొన్నారు.

- Advertisement -