వేగంగా కారు నడుపుతూ తన కారును వెనకనుంచి వేరొక కారును ఢికొట్టి పరారయ్యాడు దర్శకుడు బాబీ. మే20వ తేదిన తన స్నేహితుని బర్త్ డే పార్టీకి వెళ్లి వస్తుండగా జూబ్లీహిల్స్ లో ఈఘటన జరిగింది. కారు యాజమాని బాబీని ప్రశ్నించినందుకు తనకు పలువురు పెద్దలతో పరిచయాలున్నాయని బెదిరించి పరారయ్యాడు . అయితే యాక్సిడెంట్ కు గురైన కారు యాజమాని హర్మిందర్ సింగ్ డైరెక్టర్ బాబీ పై జూబ్లిహీల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాబీపై కేసు నమోదు చేశారు.
దీంతో పోలీసులు దర్శకుడు బాబీకి పోలీసులు ఫోన్ చేసి చెప్పడంతో..బాబీ నిన్న రాత్రి పోలీస్ స్టేషన్ లో లోంగిపోయాడు. అమీర్ పేటకు చెందిన హర్మీందర్ తన కుటుంబసభ్యలతో కలిసి ఫంక్షన్ కు వెళ్లి వస్తుండగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 33లో డైరెక్టర్ బాబీ కారు వెనుక నుంచి బలంగా ఢికొట్టడంతో హర్మీందర్ సింగ్ కారు వెనక భాగం మొత్తం నుజ్జు నుజ్జు అయింది. దీంతో డైరెక్టర్ బాబీ ని ప్రశ్నించిన హర్మీందర్ ను బాబీ కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు వచ్చి తనను బెదిరించాని పోలీసులకు తెలిపాడు.
తానూ పెద్ద దర్శకుడినని టాలీవుడ్ లో పెద్ద పెద్ద వారితో పరిచయాలున్నాయని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు బాబీ. కొంత మంది సినీ ప్రముఖుల పేర్లు చెప్పి బాబీ తనను బెదిరించాడని పోలీసుల కంప్లైంట్ పేర్కోన్నాడు హర్మీందర్. దీంతో నిన్న రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన బాబీని పలు ప్రశ్నలు అడిగి బెయిల్ ఇచ్చారు పోలీసులు.