45వ వడిలో త్రివిక్రముడు

278
online news portal
- Advertisement -

సినీ రంగంలో ప్రతీ రచయితకూ ఒకశైలి ఉంటుంది. త్రివిక్రమ్‌దీ అంతే. కాకపోతే ఆయన కలం కాస్త చిలిపిదనం.. కాస్త వెటకారం.. ఇంకాస్త గాంభీర్యం ఒలకబోస్తుంది. అన్నింటికీ మించి ఆత్మీయమైన మాటలతో ఆలోచింపజేస్తుంది. కొన్ని సంభాషణలు వింటే అరె! నిజమేగా అనిపిస్తుంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ పూర్తి పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస్‌. స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం. చదువంతా భీమవరంలోనే సాగింది. న్యూక్లియర్‌ ఫిజిక్స్‌లో మాస్టర్స్‌ చేశారు. అంతేకాదు గోల్డ్‌మెడలిస్ట్‌ కూడా. కొంతకాలం ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. సాహిత్యంపై ఉన్న అభిరుచే త్రివిక్రమ్‌ను సినిమాల వైపు మళ్లేలా చేసింది. అలా హైదరాబాద్‌ వచ్చిన ఆయన సునీల్‌తో కలిసి ఒకే రూమ్‌లో ఉన్నారు.

online news portal

పోసాని కృష్ణమురళి వద్ద సహాయకుడిగా కూడా పనిచేశారు. ఈ సమయంలోనే ‘స్వయంవరం’ సినిమాకు సంభాషణలు రాసే అవకాశం వచ్చింది. అక్కడి నుంచి ‘నువ్వేకావాలి’, ‘చిరునవ్వుతో..’, ‘నిన్నే ప్రేమిస్తా’, ‘నువ్వునాకు నచ్చావ్‌’, చిత్రాలకు సంభాషణలు రాశారు. తొలిసారి మెగాఫోన్‌ పట్టి తరుణ్‌తో తీసిన ‘నువ్వే నువ్వే’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా త్రివిక్రమ్‌ రచయిగా కొనసాగారు. ‘వాసు’, ‘మన్మథుడు’, ‘ఒకరాజు ఒకరాణి’, ‘మల్లీశ్వరి’, ‘జై చిరంజీవ’ చిత్రాలకు మాటల రాశారు. ‘చిరు నవ్వుతో..’ రచయితగా నంది అవార్డు తెచ్చిపెట్టిన తొలి చిత్రం.

online news portal
‘నువ్వే నువ్వే’ చిత్రం తర్వాత మరో సినిమాకు దర్శకత్వం వహించడానికి మూడేళ్లు సమయం తీసుకున్నారు త్రివిక్రమ్‌. మహేష్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కించిన ‘అతడు’ బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. తొలుత ఈ కథను పవన్‌కల్యాణ్‌తో తీద్దామని అనుకున్నారట. కథ చెప్పడానికి పవన్‌ దగ్గరకు వెళ్తే ఆయన వింటూ వింటూ నిద్రపోయారట. దీంతో అక్కడి నుంచి వచ్చేశారు. ఆ తర్వాత మహేష్‌తో ఆ సినిమా తీయడం ప్రేక్షకాదరణ పొందడం జరిగిపోయింది. ‘అతడు’ వచ్చి పదేళ్లు దాటినా ఆ సినిమా టీవీలో వస్తే కొద్దిసేపనై ఛానల్‌ మార్చకుండా చూసేవాళ్లు ఎందరో ఉన్నారు. ఆ తర్వాత పవన్‌తో తీసిన ‘జల్సా’ రికార్డుల మోత మోగించింది. పవన్‌ స్టామినా ఎంటో మరోసారి తెలియజెప్పిన సినిమా అది.

online news portal

మళ్లీ మహేష్‌బాబుతో కలిసి త్రివిక్రమ్‌ ‘ఖలేజా’ తీశారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించికపోయిన ఆకట్టుకుంది. మహేష్‌ డైలాగ్‌ డెలివరినీ మార్చేసిన చిత్రమది. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో ‘జులాయి’, పవన్‌తో ‘అత్తారింటికి దారేది’, మళ్లీ అల్లు అర్జున్‌తో ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ఈ ఏడాది నితిన్‌తో ‘అ ఆ’ చిత్రాలు త్రివిక్రమ్‌ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనాలు. ప్రస్తుతం పవన్‌ కథానాయకుడిగా మరో చిత్రానికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించనున్నారు.ప్రజెంట్ టాలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌ గా దూసుకుపోతున్న త్రివిక్రమ్ మరెన్నో మంచి సినిమాలు చేయాలని ఆశిద్దాం….

- Advertisement -