- Advertisement -
మాస్ జాతర తర్వాత మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రం RT76. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల స్పెయిన్‌లో ఒక పాట చిత్రీకరణను పూర్తి చేసింది చిత్రయూనిట్.
ప్రస్తుతం హైదరాబాద్‌లో మరో పాట షూట్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఖిలాడీ సినిమాలో రవితేజతో కలిసి నటించిన డింపుల్ హయాతి ఈ చిత్రంలో భాగమయ్యారని అధికారికంగా తెలిసింది. ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో ఈ విషయాన్ని పంచుకున్నారు.
ప్రస్తుతం తాను రవితేజతో కలిసి ఒక పాట షూట్ చేస్తున్నానని, ఇది ఒక “చార్ట్‌బస్టర్” అవుతుందని సూచించింది. ఆశికా రంగనాథ్ కూడా ఈ సినిమాలో నటిస్తోండగా ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా, సంగీతం భీమ్స్ సిసిరోలియో అందిస్తున్నారు. సంక్రాంతి 2026 విడుదలకు సిద్ధమవుతోంది.
Also Read:కొండా వ్యాఖ్యలపై కార్తీక్ రెడ్డి సెటైర్
- Advertisement -

