Sharwa38:శర్వా 38లో డింపుల్!

15
- Advertisement -

సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శర్వా కెరీర్‌లో ఇది 38వ సినిమా కాగా భారీ బడ్జెట్‌తో పీరియడ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

శర్వా సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించనున్నారని అధికారికంగా ప్రకటించారు. అనుపమ పరమేశ్వరన్‌కు, శర్వానంద్‌తో శతమానం భవతి బ్లాక్‌బస్టర్ తర్వాత ఇది రెండో సినిమా. తాజాగా ఈ ప్రాజెక్టులో డింపుల్ హయతి కూడా భాగమయ్యారు.

డింపూల్ హయాతి లుక్‌ని షేర్ చేస్తే షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది అని X లో ప్రకటించారు మేకర్స్. నిర్మాత కేకే రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Also Read:పాక్ పౌరులకు కేంద్రం గట్టి హెచ్చరిక..!

- Advertisement -