న‌టిగా ‘ఖిలాడి’ సంతృప్తినిచ్చింది- డింపుల్ హ‌యాతీ

108
- Advertisement -

టాలీవుడ్‌ మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న ఖిలాడీ సినిమాను కోనేరు సత్య నారాయణ నిర్మించారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రవితేజ భిన్న పాత్రలను పోషిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది. ఇందులో మీనాక్షీ చౌదరీ,డింపుల్ హ‌యాతీ రవితేజ సరసన నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా డింపుల్ హ‌యాతి మీడియా స‌మావేశంలో ప‌లు విష‌యాలు వెల్లడించింది.

డింపుల్ హ‌యాతీ మాట్లాడుతూ, నా ఫొటోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఎవ‌రో చూసి ద‌ర్శ‌కుడుకి పంపార‌ట‌. నాకు క‌థ చెప్పిన‌ప్పుడు ర‌వితేజ‌తోపాటు ఈక్వెల్ గా వుంటుంద‌ని తెలిసింది. ర‌వితేజ‌ నా ఫొటో చూసి గ‌ద్దెల‌కొండ గ‌ణేష్లో సాంగ్ చేసింద‌ని అన్నార‌ట‌. ఇంత‌కుముందు చేసిన ద‌ర్శ‌కుల‌ నుంచి చాలా విష‌యాలు నేర్చుకున్నా.. గ‌ద్దెల‌కొండ‌లో ఐటం సాంగ్ చేస్తే అలాంటివే వ‌స్తాయ‌ని అన్నారు కూడా. ఆ త‌ర్వాత ప‌లు సినిమాల‌లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ కొంత గేప్ తీసుకుని న‌టిగా నిరూపించుకోవాల‌ని మంచి సినిమా కోసం వెయిట్ చేశాను. ఇప్పుడ‌యితే ఐటం సాంగ్ లు చేయ‌లేను. ఫ్యూచ‌ర్‌లో వ‌స్తే ఆలోచిస్తాను.

ల‌క్కీగా ర‌వితేజ సినిమాలు అవ‌కాశం వ‌చ్చింది. ఇందులో నేను భిన్న‌మైన మూడు సాంగ్‌లు చేశాను. లంగా ఓణితో, ఫుల్ మాస్, గ్లామ‌ర్ రోల్ సాంగ్ చేశా. న‌టిగా ఖిలాడి సినిమా సంతృప్తినిచ్చింది అని చెప్ప‌గ‌ల‌ను. అయితే మొద‌ట్లో ఈక్వెల్ పాత్ర అంటే భ‌య‌మేసింది. ఇలా చెబుతున్నారు. తీస్తారాలేదా! అనే అనుమానం కూడా క‌లిగింది. సినిమా చేశాక నాకు ద‌ర్శ‌కుడు చెప్పింది చెప్పిన‌ట్లు తీశారు. యాక్ష‌న్ సీన్ త‌ప్పితే మొత్తం నా పాత్ర వుంటుంది. ఇలాంటి పాత్ర ఇంత‌కుముందు ఎప్ప‌డూ రాలేదు.

సినిమా విడుద‌ల‌కు ముందు ఎగ్జైట్‌మెంట్ వుంటుంది. అప్ప‌టికే సాంగ్ విడుల‌యి అంచ‌నాలు పెరిగాయి. దాంతో న‌ర్వెస్‌కూడా ఫీల్ అవుతున్నా.ఇందులో భారీ తార‌గ‌ణం వుంది. నేను ఖిలాడి చేశాక‌. సామాన్యుడు చేశాను. సామాన్యుడు లాకౌడ్‌న్‌లో 65 రోజులుల హైద‌రాబాద్‌లో చేశాను. ల‌క్కీగా రెండు సినిమాలు నెల‌గేప్‌లో ప్ర‌చారంలో రావ‌డం నా క‌ల నెరవేరిన‌ట్లుగా అనిపించింది అన్నారు.

- Advertisement -