ఓటీటీలోకి దిల్‌రుబా!

16
- Advertisement -

కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ యాక్షన్ చిత్రం దిల్‌రుబా. రుక్సార్ ధిల్లాన్ మరియు ఖ్యాతి డేవిడ్సన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా విడుదలైంది.

విశ్వా కరుణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ లాక్ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాతో పాటు ఈటీవీ విన్ లలో స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 25న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. గత ఏడాది కిరణ్ అబ్బవరం నటించిన ‘కా’ సినిమా హిట్ కావడంతో దిల్రుబాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోలేక, కమర్షియల్ పరంగా విఫలమైంది.

Also Read:సుప్రీంలో కంచె గచ్చిబౌలి భూములపై విచారణ

- Advertisement -