‘భారతీయుడు-2’కి నిర్మాత ఫిక్స్‌..!

190
dilraj will produce baratheeyudu2 movie ?
- Advertisement -

భారతీయుడు సినిమాకు సీక్వెల్ వార్త తెరపైకొచ్చిన విషయం తెలిసిందే. సరిగ్గా 2 దశాబ్ధాల క్రితం విలక్షణ నటుడు కమలహాసన్ నటించిన ‘భారతీయుడు’ సినిమా అప్పట్లో ఓ పెను సంచలనం సృష్టించింది.

అవినీతి, అక్రమాలని అరికట్టడంలో ‘భారతీయుడు’ చూపించిన తెగువ అందరి మనసుల్లో బలంగా నాటుకుపోయింది. అంతకుముందు అవినీతి అరికట్టడంపై వివిధ భాషల్లో ఎన్నోసినిమాలు వచ్చాయి కానీ అవేవీ భారతీయుడు సినిమాలా ఆకట్టుకోలేకపోయాయి.

dilraj will produce baratheeyudu2 movie ?

‘భారతీయుడు-2’ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో కూడా కమలహాసనే మరోసారి విశ్వరూపం చూపించబోతున్నారు. అగ్ర దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ మూడు భాషల్లోనూ నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించనున్నారు.

- Advertisement -