దిల్ సే..రిలీజ్ డేట్ ఫిక్స్

49
- Advertisement -

శ్రీ చైతన్య క్రియేషన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్ పై అభినవ్ మదిశెట్టి , స్నేహ సింగ్ హీరో హీరోయిన్లు గా మంకల్ వీరేంద్ర , రవికుమార్ సబ్బాని స్వీయ దర్శకత్వంలో వస్తోన్న సినిమా దిల్ సే. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో వస్తోన్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఆగస్ట్ 4న థియేటర్స్ లో విడుదల కాబోతోంది.ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు మంత్రి సబితా ఇంద్రా రెడ్డి కుమారుడు పి. కౌశిక్ రెడ్డి, నిర్మాత బెక్కం వేణు గోపాల్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పి. కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… దిల్ సే సినిమా టీజర్, సాంగ్స్, ట్రైలర్ చేశాం, మేకింగ్ బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. మా నిర్మాత మక్కల్ వీరేంద్ర గారు మంచి సినిమాలు చెయ్యాలని ఇండస్ట్రీకి వచ్చారు. దిల్ సే సినిమా తనకు మంచి పేరుతో పాటుగా గుర్తింపు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను, అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను , ఆగస్ట్ 4న విడుదల కాబోతున్న దిల్ సే సినిమాను ప్రేక్షకులలు థియేటర్ లో చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నన్నాను అన్నారు.

Also Read:ముగ్గురు హీరోయిన్లను వేధించారట

దిల్ సే సినిమాకు నూతన సంగీత దర్శకుడు శ్రీకర్ సంగీతం అందించాడు, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా నచ్చే విధంగా ‘దిల్ సే’ ఉండబోతుందని చిత్ర యూనిట్ ఈ ఈవెంట్ లో తెలిపారు. ఒన్ మీడియా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల ఆగస్ట్ 4న విడుదల చెయ్యబోతోంది.

Also Read:టెస్టు క్రికెట్‌కు బ్రాడ్ గుడ్ బై..

- Advertisement -