కరోనా ఎఫెక్ట్…నాని ‘వి’ వాయిదా..!

584
nani
- Advertisement -

నేచుర‌ల్ స్టార్ నాని, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం `వి`. ఈ చిత్రంలో నాని పాత్ర‌కు ధీటుగా ఉండే మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ ఐపీయ‌స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో సుధీర్‌బాబు న‌టించారు. నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్ లుగా నటించగా దిల్‌రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణంలో శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లుగా ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది. నానికి ‘వి’ 25వ చిత్రం.

ఇప్పటికే సినిమా ప్రమోషన్‌లో చిత్రయూనిట్ బిజీగా ఉండగా ఉగాది కానుకగా మార్చి 25న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ప్రపంచదేశాలను కరోనా వణికిస్తున్న నేపథ్యంలో నాని విపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.

ఇప్పటికే కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోంది. దీంతో వి మూవీ డిస్ట్రిబ్యూటర్ల నుండి సినిమా విడుదల తేదీని వాయిదా వేయాలనే ఒత్తిడి వస్తుందట. ఇక యుఎస్‌లో సైతం వి సినిమా వాయిదావేయాలని డిస్ట్రిబ్యూటర్లు ప్రెజర్ తీసుకువస్తున్నారట. ఇప్పటికే కరోనాతో అమెరికాలో పదుల సంఖ్యలో మరణించగా వేల మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్ డేట్ మార్చాలని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు దిల్ రాజును కోరినట్లు సమాచారం. దీంతో వారి ఒత్తిడికి తలొగ్గిన దిల్ రాజు …వి విడుదల తేదీని మార్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే కొత్త డేట్‌ని అనౌన్స్‌ చేసే అవకాశం ఉంది.

- Advertisement -