ఎన్నికలు ఇంపార్టెంట్ కాదు కానీ మెంబర్స్ అందరూ కలిసి ఒకరిని ఎన్నుకోవాలి కాబట్టి అనివార్యమయ్యానన్నారు.గెలుపు ఓటములు ముఖ్యం కాదన్నారు. ఇండస్ట్రీకి తెలుగు ఫిలీం చాంబర్ మదర్ లాంటిదని అందరం కలిస్తేనే ఇండస్ట్రీని బతికించుకోవచ్చన్నారు. మా టీం అంతా కలిసి మంచి జరగడానికి ఏం ప్రయత్నాలు చేయాలో అవన్ని చేస్తామని..ఏ సమస్యలు ఉన్నా కూర్చొని పరిష్కరించుకుంటామన్నారు.
ఇది పాలిటిక్స్ ఎలక్షన్ కాదన్నారు.సినిమా అనేది వ్యాపారం అని ఈరోజు నుంచి ఇండస్ట్రీ కి సంబంధించిన సమస్య లు పరిష్కారం కోసం కలసి పని చేస్తాం..మా గెలుపు కోసం ప్రయత్నించిన అందరికి ధన్యవాదములు తెలిపారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు.
Also Read:ఆ అలవాటుకు.. అరటిపండే పరిష్కారం
తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో దిల్ రాజు తన ప్రత్యర్థి, సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ పై విజయం సాధించారు. 31 ఓట్లతో దిల్ రాజు గెలుపొందగా టీఎఫ్ సీసీలో కీలక పోస్టులను దిల్ రాజు ప్యానెల్ కైవసం చేసుకుంది. ఫిల్మ్ చాంబర్ ఉపాధ్యక్షుడిగా ముత్యాల రామరాజు ,కార్యదర్శిగా దామోదర ప్రసాద్,కోశాధికారిగా ప్రసన్నకుమార్ ఎన్నికయ్యారు.
Also Read:దిల్‌రాజు ప్యానల్ ఘన విజయం..