అల్లు అర్జున్..’ఐకాన్‌’ కనబడుటలేదు

478
dil raju allu arjun
- Advertisement -

దువ్వాడ జగన్నాథమ్,నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తర్వాత లాంగ్ గ్యాప్‌ తీసుకుని వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు శ్రీరామ్ వేణు దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు బన్నీ. ఇక ఇవాళ అల్లు వారబ్బాయి పుట్టినరోజు సందర్భంగా సర్‌ప్రైజ్ ఇచ్చారు దర్శకుడు వేణు.

ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి బన్నీ సిద్ధమవుతున్నారు. స్క్రిప్టు కూడా దాదాపు రెడీ అయిపోయింది. ఇక సినిమా సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యం. ఈ లోగా మరో సినిమాను బన్నీ పట్టాలెక్కించేస్తున్నారు.

ఆర్య, పరుగు, డీజే వంటినిమాలను నిర్మించిన టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో నాలుగోసారి అల్లు అర్జున్ జత కట్టారు. శ్రీరాం వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా త్వరాలో ఈ మూవీ పట్టాలెక్కనుంది. ఇక బన్నీ పుట్టినరోజు సందర్భంగా చిత్ర ప్రకటనతో పాటు టైటిల్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది వెంకటేశ్వర క్రియేషన్స్.

ఈ చిత్రానికి ‘ఐకాన్’ అనే టైటిల్‌ను ఖరారు చేయగా ‘కనబడుట లేదు’ అనేది ట్యాగ్ లైన్. ‘హ్యాపీ బర్త్‌డే AA’ అంటూ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో పాటు సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ కూడా బన్నీతో సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. మొత్తంగా ఈ ఏడాది వరుస సినిమాలతో ఫ్యాన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు బన్నీ.

- Advertisement -