తెలంగాణ ప్రజలకు సారీ చెప్పిన దిల్ రాజు

4
- Advertisement -

తెలంగాణ ప్రజలకు సారీ చెప్పారు నిర్మాత దిల్ రాజు. తెలంగాణ లో కల్లు ,మటన్ కే వైబ్ ఉంటుంది. సినిమాలను ఆ తర్వాతే ప్రాధాన్యత అన్న దిల్ రాజు పై పెద్ద ఎత్తున విమర్శలు రాగా సారీ చెప్పారు దిల్ రాజు.

తన వ్యాఖ్యలను కొంత మంది వక్రీకరించారు. తాను ఆ మాటలు అనలేదన్నారు. నిజామాబాద్ లో పెద్దగా సినిమా ఈవెంట్స్ నిర్వహించమన్నారు. కానీ అప్పట్లో ఫిదా సినిమా సక్సెస్ మీట్ నిర్వహించాము. తాజాగా ఇపుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఈవెంట్ నిర్వహించాము అన్నారు.

తెలంగాణ సంస్కృతిని నేనెందకు అనరాని మాటలు అంటానని వివరణ ఇచ్చుకున్నారు. గేమ్ చేంజర్ , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో బిజీగా మన తెలంగాణ కల్చర్ అయిన దావత్ ను మిస్ అవుతున్నాను. రెండు సినిమాలు విడుదలైన తర్వాత దావత్ చేసుకొంటానన్నారు. కానీ దానిని కొంతమంది వక్రీకరించారని తెలిపారు దిల్ రాజు.

 

Also Read:బీఆర్ఎస్ రైతు మహా ధర్నా వాయిదా

- Advertisement -