దిల్ రాజు తెలుగు చిత్ర పరిశ్రమలో సక్పెస్ ప్రొడ్యూసర్ కొత్త కథలను ఎంచుకోవడంలోను .. యువ దర్శకులను ప్రోత్సహించడంలోను దిల్ రాజు ముందే ఉంటాడు. కొత్తవారిని ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందుంటారు.మంచి కథ ఉంటే చాలు వారితో సినిమా చేయడానికి ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు. అలా ఆయన అనీష్ కృష్ణ అనే దర్శకుడికి అవకాశాన్ని ఇచ్చినట్టు తెలుస్తోంది. గతంలో అనీష్ కృష్ణ ‘అలా ఎలా?’ అనే ఒక సినిమా చేశాడు. ఆ సినిమా హిట్ అయినా, ఆ తరువాత ఆయనకి సరైన సినిమా ఇంత వరకు రాలేదు
ఈ నేపథ్యంలో ఆయన దిల్ రాజుకి ఒక లైన్ వినిపించాడట. ఆ లైన్ బాగా నచ్చడంతో వెంటనే చేద్దామని దిల్ రాజు చెప్పాడని అంటున్నారు. ఈ మధ్యకాలంలో దిల్ రాజు వరుస విజయాలతో బిజీగా వున్నాడు. ఇప్పుడిప్పుడే ఆయన వాటి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన నాయకా నాయికల ఎంపిక త్వరలో పూర్తవుతుందని అంటున్నారు. అనీష్ కృష్ణ కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి. అనీష్ కృష్ణ చాలా కాలం తర్వత సినిమా తీయబోతున్నాడు.అది కూడా స్టార్ ప్రొడ్యూసర్‌తో ఈ అవకాశం అనీష్‌కి సక్సెస్‌ని ఇస్తుందా
వేచిచూడాలి.