‘తిరగబడరసామీ’ టీజర్ అదుర్స్

45
- Advertisement -

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేకర్స్ ఇదివరకే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేసింది. ఈరోజు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రం టీజర్ లాంచ్ చేశారు.

హీరో రాజ్ తరుణ్ ఇందులో వైలెన్స్ కు వ్యతిరేకంగా ఉండే అమాయకమైన కుర్రాడు. అయితే, అతను ప్రేమించే అమ్మాయికి వైలెన్స్ అంటే ఇష్టం. ఆసక్తికరమైన విషయమేమిటంటే వీరిద్దరూ నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులే. పరిస్థితులు అతని ట్రాక్ మార్చడానికి, హింసాత్మక మార్గాన్ని తీసుకోవాలని ప్రేరేపిస్తాయి. దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథను ఎంచుకున్నారు. అందమైన ప్రేమకథతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, ఫన్, మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. తన వాళ్ళ కోసం తన మార్గాన్ని మార్చే అమాయక యువకుడి పాత్రలో రాజ్ తరుణ్ యాప్ట్ గా కనిపించారు. హీరోయిన్ గా నటించిన మాల్వీ మల్హోత్రా అందంగా కనిపించింది. తను కొన్ని స్టంట్స్ కూడా చేసింది. మకరంద్ దేశ్‌పాండే విలన్ పాత్రలో కనిపించడం ఆసక్తికరం. మన్నారా చోప్రా కీలక పాత్ర పోషించింది.

ఈ చిత్రానికి జెబి సంగీతం అందిస్తున్నారు. జవహర్ రెడ్డి కెమరామెన్ గా పని చేస్తున్నారు. బస్వా పైడిరెడ్డి ఎడిటర్, రవికుమార్ గుర్రం ఆర్ట్ డైరెక్టర్. భాష్యశ్రీ డైలాగ్స్ అందిస్తున్నారు. సినిమా ప్రిమైజ్ పరిచయం చేసే టీజర్ కూల్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. త్వరలోనే సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఏఎస్ రవికుమార్ చౌదరి పిల్లా నువ్వు లేని జీవితం లాంటి హిట్ చిత్రాలని అందించిన మా దర్శకుడు. అలాగే రాజ్ తరుణ్ ఉయ్యాలా జంపాల, సినిమా చూపిస్తా మావా లాంటి ఎన్నో సూపర్ హిట్లు ఇచ్చారు. రాజ్ తరుణ్ ఎక్స్ టార్దినరీ ఆర్టిస్ట్. ఈ టీజర్ చూస్తుంటే అండర్ ప్లే పాత్ర చేసి ఫైనల్ గా తిరగబడరసామీ అని క్లైమాక్స్ లో ఇరగదీసినట్లు అర్ధమౌతుంది. ఎంటర్ టైమెంట్ సినిమా అనుకున్నాను. టీజర్ చూస్తుంటే ఫుల్ మాస్ సినిమాలా వుంది. రాజ్ తరుణ్, రవి కుమార్ కమ్ బ్యాక్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.

హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. దర్శకుడు రవికుమార్ చౌదరి గారు ఈ సినిమాతో నాలో కొత్త కోణం చూపించారు. నేను చిన్నచిన్నగా తప్పితే యాక్షన్ పెద్దగా ఎపుడూ చేయలేదు. క్లైమాక్స్ షూట్ చేసినప్పుడు కూడా అడిగాను. ఇంతసేపు సైలెంట్ గా వున్నావ్ కాబట్టి ఎప్పుడో ఒకసారి పేలాల్సిందే అని చెప్పారు( నవ్వుతూ). సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే విడుదల చేస్తాం. మీ అందరికీ నచ్చుతుంది. దయచేసి అందరూ థియేటర్స్ లోనే చూడాలి. డోంట్ యంకరేజ్ పైరసీ’’ అన్నారు.

ఏఎస్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ.. కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత నాకు మళ్ళీ రీబర్త్ ఇస్తున్న మా నిర్మాత శివకుమార్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ తెలుగు ఇండస్ట్రీలో మరో యాక్షన్ హీరో అవుతారు. ఇది నా ప్రామిస్. ఇందులో సందేహం లేదు. తను డైరెక్టర్ ఆర్టిస్ట్. అలాగే మాల్వి మల్హోత్రా, మన్నారా చోప్రా మంచి పాత్రలు చేశారు. జెబీ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. డీవోపీ జవహర్ రెడ్డి ప్రాణం పెట్టి ఈ సినిమా తీశారు. ఈ సినిమా తర్వాత తనకి చాలా పేరువస్తుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.’’ తెలిపారు.

Also Read:దనియాల కషాయంతో..ఆ సమస్యలు దూరం!

నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. దిల్ రాజు గారిది గోల్డెన్ హ్యాండ్. ఆయన టీజర్ లాంచ్ చేసి ప్రమోషన్స్ ని మొదలుపెట్టడం చాలా అనందంగా వుంది. వారికి ధన్యవాదాలు. దర్శకుడు రవి కుమార్ చౌదరి గారు ఈ కథ చెప్పిన వెంటనే నచ్చేసింది. రవి కుమార్ చౌదరి గారు ఎన్నో విజయాలు ఇచ్చారు. ఈ కథ ఎంత చక్కగా చెప్పారో దాని వంద రెట్లు అద్భుతంగా సినిమాని తీశారు. ఈ సినిమాతో ఆయనకి రీలైఫ్ స్టార్ట్ అవుతుందని భావిస్తున్నాను. నేను చేసిన చిత్రాల్లో సూర్య వెర్సస్ సూర్య నా మనసుకు దగ్గరైన చిత్రం. ఆ టీంతో మరో పది సినిమాలు చేయడానికి సిద్ధంగా వుంటాను. అదే విధంగా ఈ సినిమా టీంతో కూడా రెడీగా వుంటాను. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో గుమ్మడికాయ కొట్టినప్పుడు కూడా అదే సంతోషం వుంటే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఆ సంతోషం ఈ సినిమా విషయంలో వుంది. జెబీ మంచి మ్యూజిక్ ఇచ్చారు. డీవోపీ జవహర్ రెడ్డి ప్రాణం పెట్టి ఈ సినిమా తీశారు. మాల్వి చక్కని నటన కనబరిచింది. మకరంద్ దేశ్‌పాండే ఈ సినిమా మరో ఎసెట్. అలాగే మన్నారా చోప్రా పాత్ర కూడా కీలకంగా వుంటుంది. ఆమెకు మంచి కమర్షియల్ సాంగ్ కూడా వుంటుంది. రాజ్ తరుణ్ తో ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఇందులో చాలా పరిణితి గల పాత్రలో అద్భుతంగా నటించారు. నిఖిల్ తో ఎలాంటి ఎటాచ్మెంట్ వుందో రాజ్ తరుణ్ తో కూడా అలంటి అనుబంధం వుంది. రాబోయే రోజుల్లో పాన్ ఇండియా కంటెంట్ తో కలసి పని చేస్తాం. ‘తిరగబడరసామీ’ లో పని చేసిన అందరికీ ధన్యవాదాలు’’ తెలిపారు.

మన్నారా చోప్రా మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఇందులో మొదటిసారి నెగిటివ్ రోల్ లో కనిపిస్తాను. పాత్ర చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఇందులో మంచి డ్యాన్సింగ్ నెంబర్ కూడా వుంది. రాజ్ తరుణ్ చాలా సపోర్టివ్ గా వుంటారు. తనతో మరిన్ని చిత్రాలు చేయాలని వుంది. మకరంద్ దేశ్ పాండే గారి కలసి నటించే అవకాశం రావడం కూడా అనందంగా వుంది. చిత్ర యూనిట్ అందరికీ థాంక్స్’’ తెలిపారు.

బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘తిరగబడరసామీ’ నిర్మాత మాకు స్నేహితులు. చాలా ఎంపికగా సినిమాలు చేస్తారు. ఈ సినిమా కోసం తను ఎంచుకున్న టీం అద్భుతంగా వుంది. టీజర్ లో అన్ని ఎలిమెంట్స్ వున్నాయి . దర్శకుడు రవికుమార్ చౌదరి గారు నా ఫేవరేట్ డైరెక్టర్. అలాగే రాజ్ తరుణ్ మాకు సినిమా చుపిస్తామా లాంటి మంచి విజయాన్ని ఇచ్చిన హీరో. తన విజయాన్ని నేను ఎంతగానో ఆస్వాదిస్తాను. ఈ సినిమాతో పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

దర్శకుడు సముద్ర మాట్లాడుతూ.. దర్శకుడు రవికుమార్ గారు చాలా మంచి పాయింట్ తో తిరగబడరసామీ’ చేశారు. సినిమా అద్భుతంగా వచ్చింది. రాజ్ తరుణ్ కొత్త కోణంలో కనిపిస్తున్నారు. ఈ సినిమా కూడా ‘యజ్ఞం’లా చాలా పెద్ద హిట్ అవుతుంది’’ ఆన్నారు.

తాగుబోతు రమేష్.. దర్శకుడు రవికుమార్ చౌదరి గారు ఇండస్ట్రీలోని కమర్షియల్ డైరెక్టర్స్ లో టాప్ 3లో వుంటారు. ఆయనతో పని చేస్తే కమర్షియల్ పల్స్ తెలుస్తుంది. ఆయన దర్శకత్వంలో పని చేయడం అనందంగా వుంది. రాజ్ తరుణ్ గారితో పని చేయడం చాలా అనందంగా వుంటుంది. సినిమా చాలా అద్భుతంగా వుంటుంది. మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

Also Read:ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల

- Advertisement -