- Advertisement -
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దిల్ రాజును నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దిల్ రాజు ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.
దిల్ రాజు అసలు పేరు వెంకటరమణారెడ్డి. 1990లో పెళ్లి పందిరి అనే సినిమాతో పంపిణీదారుడిగా దిల్‌రాజు కెరీర్ ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఆయన సినిమాలను నిర్మిస్తున్నారు. 2003లో దిల్ సినిమాకు తొలిసారి ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఆ చిత్రం హిట్ తర్వాత ఆయన పేరు దిల్‌రాజుగా మారిపోయింది. ‘దిల్ రాజు డ్రీమ్స్’ పేరుతో కొత్త బ్యానర్ క్రియేట్ చేసి చిన్న సినిమాలు తీస్తామని ఇటీవలె ప్రకటించారు.
Also Read: సంధ్య థియేటర్ ఘటనపై బన్నీ
- Advertisement -