2 గంటల పాటు దిల్ రాజు విచారణ

1
- Advertisement -

ఐటీ అధికారుల హాజరణకు హాజరయ్యారు FDC చైర్మైన్, నిర్మాత దిల్ రాజు. దాదాపు 2 గంటల పాటు దిల్ రాజును విచారించారు ఐటీ అధికారులు. ఐటీ అధికారులు అడిగిన డాక్యుమెంట్లను, బ్యాంక్ స్టేట్మెంట్లను సబ్మిట్ చేసినట్టు సమాచారం. అందుబాటులో ఉండాలని, ఎప్పుడు పిలిచినా రావాలని దిల్ రాజును కోరారు ఐటీ అధికారులు.

గత వారం దిల్ రాజు ఇంట్లో నాలుగు రోజుల పాటు సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. సోదాల అనంతరం వ్యాపారాలకు సంబంధించిన వివరాలు తీసుకురావాలని దిల్ రాజుకు నోటీసులు జారీ చేశారు. సినిమాల నిర్మాణం, ఎగ్జిబిషన్ లాభాల వ్యవహారంపై ఐటీ అధికారులు ఆరా తీశారు.

ఇక ఐటీ రైడ్స్‌లో గతంలో మాట్లాడిన దిల్ రాజు.. మా అందరి దగ్గర మొత్తంగా 20 లక్షలు కూడా దొరకలేదు అన్నారు. మా దగ్గర చాలా డబ్బు దొరికింది, డాక్యుమెంట్స్ దొరికాయని సోషల్ మీడియాలో హైలైట్ చేశారు అన్నారు.

Also Read:పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు

- Advertisement -