తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే గద్దర్ అవార్డులను ప్రకటించింది. సినీ రంగంలో విశేష కృషి చేసిన కళాకారులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులను ప్రకటించారు. వివిధ విభాగాల్లో పలువురు ప్రముఖులు ఈసారి అవార్డులకు ఎంపికయ్యారు.
ఈ ఏడాది బెస్ట్ డైరెక్టర్ అవార్డును సాయిలు “రాజు వెడ్స్ రాంబాయి” సినిమాకు అందుకున్నారు. బెస్ట్ లీడింగ్ యాక్టర్ అవార్డును నాగచైతన్య “తండేల్” చిత్రానికి గెలుచుకున్నారు. బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్‌గా రష్మిక మందాన “గర్ల్ ఫ్రెండ్” సినిమాకు ఎంపికయ్యారు. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డును శివాజీ “దండోర” సినిమాకు అందుకున్నారు.
సినిమాల విభాగంలో “రాజు వెడ్స్ రాంబాయి” చిత్రానికి ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు లభించింది. “దండోర” సినిమాకు సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు ప్రకటించారు.
ఇక ప్రత్యేక అవార్డుల విభాగంలో ప్రముఖ నటుడు చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ప్రకటించారు. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్కు నాగిరెడ్డి-చక్రపాణి అవార్డు లభించింది. లెజెండరీ నటుడు కమల్ హాసన్కు పైడి జయరాజ్ అవార్డు ప్రకటించారు.
అలాగే ప్రముఖ నటి జయసుధకు అక్కినేని అవార్డు, గేయరచయిత సుద్దాల అశోక్ తేజకు సినారె అవార్డు, నటుడు ఆర్. నారాయణమూర్తికి కాంతారావు అవార్డు లభించాయి.
సంగీత దర్శకుడు సంగీతం శ్రీనివాస్కు బీఎన్ రెడ్డి అవార్డు, నిర్మాత రమేష్ ప్రసాద్కు రఘుపతి వెంకయ్య అవార్డు ప్రకటించారు. ఈ అవార్డులు సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ప్రదానం చేయనున్నారు.
Also Read;ఊబకాయంతో క్యాన్సర్ ముప్పు?
ఉత్తమ నటుడు – నాగ చైతన్య (తండేల్)
ఉత్తమ నటి – రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)
ఉత్తమ చిత్రం – రాజు వెడ్స్ రాంబాయి
ఉత్తమ ద్వితీయ చిత్రం – దండోరా
ఉత్తమ తృతీయ చిత్రం – ది ప్రీ వెడ్డింగ్ షో
నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా – తండేల్
ఉత్తమ పర్యావరణ చిత్రం – ఇగ్వా
ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ – లిటిల్ హార్డ్స్
ఉత్తమ వినోదాత్మక చిత్రం – సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం – కోర్టు
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీ – మిరాయ్
ఉత్తమ బాలల చిత్రం – అనగనగనా
ఉత్తమ దర్శకుడు – సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ సపోర్టింగ్ నటుడు – శివాజీ
ఉత్తమ సపోర్టింగ్ నటి- భూమిక
ఉత్తమ సంగీత దర్శకుడు – మార్క్ కె రాబిన్ (దండోరా)
ఉత్తమ నేపథ్య గాయకుడు – అనురాగ్ (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నేపథ్య గాయని – సాహితి చాగంటి (కన్నప్ప)
ఉత్తమ హాస్యనటుడు – కృష్ణ తేజ (జిగ్రీస్)
ఉత్తమ బాలనటుడు – రోహన్ రాయ్ (ప్రీ వెడ్డింగ్ షో)
ఉత్తమ కథా రచయిత – గుణశేఖర్ (యుఫోరియా)
ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ – అనిల్ రావిపూడి
ఉత్తమ గేయ రచయిత – నందకిశోర్ (కుబేర)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
ఉత్తమ ఎడిటర్- శ్రీకర్ ప్రసాద్ (మిరాయ్)
ఉత్తమ ఆడియోగ్రాఫర్ – ఎం.ఆర్ రాధాకృష్ణన్ కిష్కిందపురి
ఉత్తమ కొరియోగ్రాఫర్ – గిర గిర గిర
ఉత్తమ ఆర్ట్ డైరక్టర్ – తోట తరణి ఛాంపియన్
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – గోవింద్ అఖండ
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ – చాంపియన్ – చంద్రకాంత్
ఉత్తమ స్పెషల్ జ్యూరీ ఫిల్మ్ – 23
ఉత్తమ మేల్ యాక్టర్ – చైతూ జొన్నలగడ్డ (రాజు వెడ్స్ రాంబాయి)
ఉత్తమ నటి – అనంతిక (8 వసంతాలు)
స్పెషల్ జ్యూరీ హీరో – రోషన్ (చాంపియన్)

