గేమ్ చేంజర్, సంక్రాంతి వస్తున్నాం సినిమాలను నిర్మించి నిర్మాత దిల్‌రాజు. ఈ సంక్రాంతి సందర్బంగా గేమ్ చేంజర్‌ను జనవరి 10న, సంక్రాంతికి వస్తున్నాం సినిమాను జనవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా..
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘‘గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. అలా జరగటానికి కారణం.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌గారు. మేం అడగ్గానే ఈవెంట్‌కు రావటం ఆనందంగా అనిపించింది. నా లైఫ్‌లోనే అద్భుతమైన ఈవెంట్ అది. మెగాభిమానులు, జన సేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్‌గారి అభిమానులు అందరూ సపోర్ట్ చేశారు. అలాగే ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి వస్తోన్న సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోస్‌కు అనుమతులు ఇవ్వటం, టికెట్ రేట్స్ పెంచుకోవటానికి పర్మిషన్ ఇచ్చింది. పవన్‌కళ్యాణ్‌గారు చొరవ తీసుకుని మాకు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌గారితో మాట్లాడారు. సంక్రాంతికి వస్తోన్న మూడు సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకోవటానికి అనుమతి ఇచ్చారు. దీనికి కారణమైన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారికి, పవన్ కళ్యాణ్‌గారికి, మంత్రి దుర్గేష్‌గారికి, పోలీస్ డిపార్ట్‌మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
సంక్రాంతి పండుగ వస్తుందంటే మన తెలుగు ప్రేక్షకులు ఏ రోజు ఏ సినిమా వస్తుందనే ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు తమిళ, కర్ణాటక సహా గ్లోబల్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నార్త్‌లోనూ, ఓవర్‌సీస్‌లో తెలుగు సినిమాలకు క్రేజ్, రేంజ్ పెరుగుతున్నాయి. గేమ్ చేంజర్ పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అవుతుంది. ఫుల్ స్ట్రెస్‌లో వర్క్ చేస్తున్నాను. వీలైనంత త్వరగా అన్నీ చోట్లకు గేమ్ చేంజర్ కంటెంట్ పంపేయాలి. గేమ్ చేంజర్ నాకెంతో ప్రత్యేకమైన సినిమా. మూడున్నరేళ్ల ప్రయాణమిది. 2021 ఆగస్ట్‌లో సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశాం. ఎన్నో ఆటుపోట్లును చూశాను. నిజం చెప్పాలంటే కోవిడ్ రావటం కంటే ముందే ఈ జర్నీ ప్రారంభం అయ్యింది. కోవిడ్ ముందు నుంచి అంటే నాలుగున్నరేళ్ల నుంచి నా జర్నీ ఎలా జరుగుతుందా? అని ఎదురు చూస్తున్నాను. కోవిడ్ రాక ముందు, 2020లో సినిమా స్టార్ట్ చేసి, మే 21నే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. అయితే అదే ఏడాది మార్చిలో కోవిడ్ వచ్చింది. దాంతో సినిమాను 2021 ఏప్రిల్ 9న రిలీజ్ చేశాం. సినిమా రిలీజైన నాలుగో రోజునే మళ్లీ కోవిడ్ విజృంభణ స్టార్ట్ కావటంతో థియేటర్స్ మళ్లీ షట్ డౌన్ అయ్యాయి. గ్యాప్ తీసుకున్న తర్వాత కళ్యాణ్‌గారి రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. నేను, డైరెక్టర్ వేణు సినిమాను బ్లాక్ బస్టర్ చేయాలని చాలా ప్లాన్ చేసుకుని చేశాం. అయితే సినిమా రిలీజ్ తర్వాత కోవిడ్ సెకండ్ వేవ్ రావటంతో మళ్లీ థియేటర్స్ బంద్ అయ్యాయి. అది నాకు కాస్త డిసప్పాయింట్‌గా అనిపించిందనే చెప్పాలి. దాంతో బ్రేక్ కావాలనే ఉద్దేశంతో నేను నెల రోజుల పాటు అమెరికా వెళ్లిపోయాను. తర్వాత వారిసు సినిమా చేశాం. తమిళంలో సినిమా చేయటంతో తమిళంలోనే మంచి పేరొచ్చింది. తెలుగులో రావాల్సినంత గుర్తింపు రాలేదు. తర్వాత బలగం సినిమా చేశాం. సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు కూడా తెలంగాణ నేపథ్యంలో చేయటం వల్ల.. తెలంగాణలో వందకు వంద మార్కులు వస్తే, ఇతర చోట్ల 70-80 మార్కులే వచ్చాయి. ఇలాంటి సమయంలో నన్ను నేను అనాలసిస్ చేసుకంటూ వస్తున్నాను. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ తర్వాత మా ఏడేళ్ల మనవడు ఆరాంశ్ ఫోన్ చేసి తాత నువ్వు డిసప్పాయింట్ అవకు, నీ చేతిలో గేమ్ చేంజర్ ఉంది.. దాంతో కొడతావ్ అన్నాడు. అది నాకు చాలా ఎమోషనల్‌గా అనిపింది. అప్పుడు చేంజ్ తీసుకున్నాను. ఎక్కడ ఇన్‌స్పైర్ కావాలి. ఎక్కడ పట్టుకోవాలనే టార్గెట్ స్టార్ట్ అయ్యింది. సన్నిహితులు, శ్రేయోభిలాషులతో మాట్లాడే క్రమంలో అనుకున్న రిజల్ట్‌తో సినిమాలు రావటం లేదని అన్నారు. దాంతో నాలో తెలియని భయం స్టార్ట్ అయ్యింది. స్టోరీ జడ్జ్‌మెంట్ పోయిందా? మళ్లీ కాంబినేషన్‌లకే వెళ్లాలా? అని ఆలోచించటం మొదలు పెట్టాను. శిరీష్‌గారైతే ఓవర్‌లోడ్ కారణంగా కాన్‌సన్‌ట్రేషన్ చేయలేకపోతున్నానని కూడా అన్నారు. దాంతో వర్క్‌నంతా స్ట్రీమ్‌లైన్ చేయాలని నిర్ణయించుకున్నాను. సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే వేల్యూ ఉంటుంది.
చేతిలో ఏ సినిమాలున్నాయి, ఎలాంటి రిజల్ట్ తెచ్చుకోవాలని ఆలోచించటం మొదలు పెట్టాను. ఆ సమయంలో శంకర్‌గారి ఇండియన్ 2 రిలీజైంది. ఆ సినిమా రిజల్ట్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. దాంతో శంకర్‌గారి మీద విమర్శలు వచ్చాయి. ఆ సమయంలో గేమ్ చేంజర్ కథను శంకర్‌గారు చెప్పిన్పుడు నేను ఏదైతే నమ్మానో దాని మీద శంకర్‌గారితో చాలా సార్లు డిస్కషన్ పెట్టుకున్నాను. గేమ్ చేంజర్ రిజల్ట్ హీరోగారికి, మీకు, నాకు ఎంతో ముఖ్యమని చెబుతూ వర్క్ చేస్తూ వచ్చాం. గేమ్ చేంజర్ విషయానికి వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో ఏ రకంగా తీసుకున్నా ప్రేక్షకులు సినిమా చూసి విజిల్స్ కొట్టే మూమెంట్స్ చాలానే ఉంటాయి. ‘శంకర్‌గారు ఎంత పెద్ద కమర్షియల్ సినిమా చేసినా అందులో మంచి మెసేజ్ ఉండేది, అలాగే నువ్వు కూడా ఎంత పెద్ద కమర్షియల్ సినిమా చేసినా ఒక వేల్యూ ఉండేది’ అని ఓసారి చిరంజీవిగారు అన్నారు. శంకర్‌గారు గేమ్ చేంజర్ కథ చెప్పినప్పుడు నేను ఫీల్ అయిన దానికి, చిరంజీవిగారి స్టేట్‌మెంట్.. రెండూ సింక్ అయ్యాయి. కమర్షియల్ అంశాలతో పాటు రెస్పెక్ట్‌గా ఫీల్ అయ్యే సినిమా గేమ్ చేంజర్. శంకర్‌గారి శివాజీ సినిమా చూస్తే అందులో హీరోయిజం ఉంటూనే హీరోకి, విలన్‌కి మధ్య ఓ టిట్ ఫర్ టాట్ ఉంటుంది. ఇప్పుడు పొలిటికల్‌గా చూసుకున్నా, హీరో రామ్ చరణ్‌గారు, విలన్ ఎస్.జె.సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు విజిల్స్ వేసేలా ఉంటాయి. ఫైనల్‌గా చూసుకుంటే అన్నీ చక్కగా కుదిరాయి. మూడు, నాలుగున్నరేళ్ల ఎమోషన్స్‌కు మరో మూడు నాలుగురోజుల్లో ఫలితం రానుంది. సినిమా చూసే ప్రేక్షకుల నుంచి మంచి అప్రిషియేషన్స్ వస్తాయి. వారికి వావ్ మూమెంట్స్ ఎన్నో ఉన్నాయి. ముంబైలో మీడియా ఇంటరాక్షన్‌కు వెళ్లినప్పుడు శంకర్‌గారిని ఒప్పించి జరగండి సాంగ్‌ను అందరికీ చూపించాను. అందరూ అద్భుతంగా రియాక్ట్ అయ్యారు. సాంగ్స్ కోసం రూ.75 కోట్లు ఖర్చు పెట్టాం. అద్భుతమైన విజువల్ గ్రాండియర్‌తో పాటలు మెప్పించనున్నాయి. సినిమా 2 గంటల 43 నిమిషాలు రన్ టైమ్ ఫిక్స్ అయ్యింది. సినిమా చక చకా పరుగులు పెడుతుంది. నేను చాలా ఎగ్జయిటెడ్‌గా వెయిట్ చేస్తున్నాను. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం నాకు కమ్ బ్యాక్ ఫిల్మ్స్ అని నమ్మకంగా ఉన్నాను.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విషయానికి వస్తే ఆల్‌రెడీ సూపర్ హిట్ అని అందరూ అంటున్నారు. ఈ బజ్ రావటానికి కారణం అనీల్ రావిపూడి. తను కథ చెప్పినప్పటి నుంచి అన్నీ తన మీద వేసుకుని సినిమాను ఎఫ్2లాగా సూపర్ హిట్ కొట్టాలని కష్టపడ్డారు. ఎఫ్2ను ఆడియెన్స్ ఎలాగైతే ఎంజాయ్ చేశారో, అలాగే సంక్రాంతికి వస్తున్నాం సినిమా బిగ్ హిట్ కాబోతుంది. అలా రెండు సినిమాలతో ఫుల్ ఎనర్జీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. తెలుగు ప్రేక్షకులు మా సినిమాలను సక్సెస్‌ఫుల్‌గా మరో లెవల్‌లో ఉంచుతారు. నెక్ట్స్ చేయబోయే సినిమాలను చాలా జాగ్రత్తగా చేయాలని ప్రయత్నిస్తున్నాను.
నేను ఇంత ఎనర్జీ తెచ్చుకోవటానికి కారణం..పవన్ కళ్యాణ్‌గారు. 12 ఏళ్ల క్రితం ఆయన కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. ఇంత ఇమేజ్ పెట్టుకుని ఇప్పుడు పాలిటిక్స్‌లోకి వెళ్లటం అవసరమా! అని నాతో సహా చాలా మంది అనుకున్నారు. అయితే ఆయన పదేళ్ల జర్నీ చూస్తే మనలో తెలియని ఎనర్జీ వస్తుంది. రాజకీయాల్లోకి వెళ్లారు వర్కవుట్ కాలేదు. అలాగని వదిలి పెట్టలేదు. మళ్లీ ఇక్కడకు వచ్చి సినిమాలు చేశారు. ఇటీవల ఎన్నికల్లో ఆయన కూటమిలోని ఆయన పార్టీ 21కిగానూ 21 సీట్లు గెలిచినప్పుడు ఆయన విజయం కనిపించింది. ఆయనొక గేమ్ చేంజర్‌లా కనిపించాడు. ఆయన ప్రయాణం చూసి నేను ఫెయిల్ అవుతున్నానని చెప్పి ఆగిపోకూడదు.. ఏ హార్డ్ వర్క్ చేశామో అది మిస్ కాకూడదని, కళ్యాణ్‌గారిని చూసి ఇన్‌స్పైర్ అయ్యి జర్నీ చేస్తున్నాను. ఏపీలో సినిమాలకు సంబంధించిన బెనిఫిట్ ఫోస్, టికెట్ రేట్స్ పెంచటంపై క్లారిటీ వచ్చేసింది. త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రిగారిని కూడా కలిసి రిక్వెస్ట్ చేస్తాను. తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదే.. నిర్మాతగా నా బాధ్యత అది.
‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఆ విషయంపై మేం సంతోషంగా ఉన్న సమయంలో ఇలా ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవటం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. నా వంతుగా వారి కుటుంబాలకు చెరో రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘటన జరిగినప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను.
పవన్ కళ్యాణ్‌గారితో వకీల్ సాబ్ సినిమా చేయాలని ఆయన్ని కలిసి మాట్లాడాను. సినిమా అందరికీ రీచ్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నామని చెప్పాం. ఆయన నా మాటలపై నమ్మకం ఉంచారు. తర్వాత ఫైనాన్సియల్ వ్యవహారాలను మాట్లాడుకున్నాం. సినిమా చేశాం. తర్వాత పవన్‌గారు చెప్పే వరకు ఆ సినిమా రెమ్యునరేషనే జనసేన పార్టీకి ఇంధనంగా ఉపయోగపడిందని నాకు తెలియదు. ఆయనకు ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అంత పెద్ద స్టేజ్‌పై చెప్పటంతో చాలా ఎమోషనల్‌గా అనిపించింది. ఓ డిప్యూటీ సీఎం, లీడర్‌గా ఉండి.. ఆయనలా పబ్లిక్‌గా చెప్పినప్పుడు పాదాభివందనం చేయాలనిపించింది.
టికెట్ రేట్స్‌ను చూసి పెంచమని రిక్వెస్ట్ చేయాలి, అందుకు తగినట్టే పెంచాలి. అసాధారణంగా పెంచేస్తే అది తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచ స్థాయికి వెళ్లింది. మనకు గౌరవం దక్కుతుంది. అందుకు తగినట్టే సినిమా బడ్జెట్, పరిధి పెరిగింది. దానికి అనుగుణంగానే సినిమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే చేస్తున్నారు’’ అన్నారు.
శనివారం రాజమహేంద్రవరంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలో పాల్గొని తిరిగి ఇళ్లకు వెళుతున్న క్రమంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్(22) ప్రమాదవశాత్తు మరణించారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే నిర్మాత దిల్‌రాజు మీడియా సమక్షంలో వెంటనే స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘‘‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఆ విషయంపై మేం సంతోషంగా ఉన్న సమయంలో ఇలా ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవటం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. నా వంతుగా వారి కుటుంబాలకు చెరో రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘటన జరిగినప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను’’ అని అన్నారు.
Also Read:డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్..టికెట్ల రేట్లు పెంపు