రెడ్‌బుక్‌కు పోటీగా డిజిటల్ బుక్!

6
- Advertisement -

టీడీపీ రెడ్ బుక్‌కు పోటీగా డిజిటల్ బుక్‌ను లాంఛ్ చేశారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. వైసీపీ నేతల సమావేశంలో డిజిటల్ బుక్ యాప్‌ను లాంచ్ చేశారు జగన్. కార్యకర్తలు, నేతల సమాచారాన్ని డిజిటల్ బుక్‌లో నమోదు చేయాలని సూచించారు జగన్.

పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ మీటింగ్‌కు రీజనల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ మెంబర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరయ్యారు.

అలాగే రాష్ట్ర కార్యదర్శులు (కో-ఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంటు)లు హాజరు కాగా సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజాసమస్యలు తదితర అంశాలపై పార్టీ నేతలతో జగన్‌ చర్చించారు.

Also Read:TGPSCకి హైకోర్టులో ఊరట

- Advertisement -