డైటింగ్ చేస్తే బరువు తగ్గరట..?

93
diet

లావుగా ఉన్నవాళ్లు సన్నబడడానికి..బరువు తగ్గడానికి డైటింగ్ చేస్తుంటారు. కొంతమందేమో నాజుకుగా కనబడేందుకు డైట్ చేస్తారు. బరువు తగ్గేందుకు డైటింగ్ చేస్తున్నారా అయితే జాగ్రత్త ఎందుకంటే డైటింగ్ చేస్తే.. కచ్చితంగా ఇంకాస్త బరువు పెరుగుతారు అంటున్నారు పరిశోధకులు. పదే పదే డైటింగ్ పేరుతో ఆహారం తక్కువగా తీసుకునే వారిలో బరువు పెరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. డైటింగ్‌తో ఆహారం తీసుకునే వారు తక్కువ క్యాలరీలు తింటారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, డైటింగ్ ముగిసిన అనంతరం వారు బాగా తింటారు. అందువల్ల వీరి శరీరాకృతి అదుపు తప్పుతుంటుంది.

diet
డైటింగ్‌ అసలు చేయని వాళ్లు శరీరానికి సరిపడినంత ఆహారం తీసుకుంటారు కాబట్టి, ఎక్కువ ఫ్యాట్‌‌ను వారు శరీరంలో స్టోర్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని, దీంతో వారి మెదడు ఆహారానికి సంబంధించి ఎలాంటి సంకేతాలు పంపదని, అదే డైటింగ్ తరచు చేసేవారి మైండ్ మాత్రం కొవ్వును నిల్వ చేసుకోవాలనే సంకేతాలు పంపుతుందని పరిశోధనలో వెల్లడైంది. డైటింగ్ చేయని వారికంటే డైటింగ్ చేసేవాళ్ల సగటు బరువు ఎక్కువగా ఉంటోందట. దీనికి కారణం మొదట చెప్పుకున్నట్లు డైటింగ్ చేయనివారు శరీరానికి కావల్సినంత ఆహారం తీసుకోవడం వల్ల వారికి ఎక్కువ ఫ్యాట్‌ నిల్వలు అవసరం లేదని, డైటింగ్ చేసేవారి శరీరంలో ఫ్యాట్ నిల్వ ఉంటుందని, దీంతో వారు బరువు ఎక్కువ కనిపిస్తారని పరిశోధకులు చెపుతున్నారు.

డైటింగ్ చేసేవారిలో ఎక్కువ తినాలనే కోరిక ఉంటుందని, తద్వారా శరీరానికి అవసరమైన ఫ్యాట్ నిల్వ చేసుకోవచ్చననే సంకేతాలు విడుదల చేస్తుందని.. అసలు డైటింగ్ చేయని వారికి అలాంటి సంకేతాలు పంపవని పరిశోధకులు అంటున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు డైట్ ఫాలో కాకుండా పోషకాహారం తీసుకుంటేనే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.