భూమ్మీద ఉన్న ప్రతి మనిషికి ఎదో ఒక భయం(ఫోబియా) ఉంటుంది. అది చిన్న వస్తువును చూసిన పెద్ద జంతువును చూసిన భయం అనేది పుడుతుంది. అందులో కొంతమందికి జీవితం పర్యంతం ఉంటే మరికొందరికి ఊహించని ఘటనల నుంచి ఎదురవుతుంది. అలాంటి వాటిలో కొన్ని కొత్త భయాలు వుంటాయి.
ఫోబియాతో బాధపడేవారికి ప్రధాన లక్షణం భయాన్ని కలిగించే వస్తువు లేదా పరిస్థితిని నివారించాలనే కోరిక మరియు ఆందోళన మరియు వేదన యొక్క స్థితిని సృష్టిస్తుంది. మానసిక విశ్లేషణ కోసం, ఫోబియా అపస్మారక విషయాల తొలగింపు నుండి ఉద్భవిస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో అపస్మారక డ్రైవ్‌ల స్థాయిలోని ఆలోచనను తొలగించడం ద్వారా భయం ఏర్పడుతుంది. తెలిసిన అనేక భయాలలో, చాలా వింతగా మరియు ఆసక్తిగా ఉంటాయి. మేము వాటిలో కొన్నింటిని ఎంపిక చేసాము… మీరే చూడండి.
కౌగిలింతల భయం
కౌగిలింత అనేది ప్రాశ్చాత్య సంస్కృతిలో ఆలింగనం. ప్రాశ్చాత్య సంస్కృతి కలిగిన దేశాల్లో కౌగిలింత అనేది సర్వసాధారణమైన విషయం. ఇది భారతదేశంలోని ప్రజలు పెద్దగా ఉపయోగించుకోరు. కొన్ని సందర్భాల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు బంధుత్వంలోని ఇది సర్వసాధారణం. కౌగిలింతల భయంను హాఫెఫోబియా అంటారు.
భయం భయం
సాధారణంగా ఆందోళన సమస్యలు మరియు తీవ్ర భయాందోళన కలిగించే వాటిని, రుగ్మతలను కలిగి ఉండే భయాన్ని ఫోబోఫోబియా అంటారు.
ఇతర వ్యక్తులతో కలిసి తినడం
ఇతర వ్యక్తులతో కలిసి తినడం కూడా ఒక భయం. కొంతమంది ఫంక్షన్‌లలో చుట్టాల వద్ద జరిగే సామూహిక భోజనాల వద్ద ఇతరులతో కలిసి తినలేని వ్యక్తులకు ఉండే భయం డీప్నోఫోబియా అంటారు.
గడ్డం యెక్క భయం
పురుషులకు ఉండే గడ్డం చూస్తే కూడా కొంత మందికి భయం వేస్తుంది. ఇది వారిలో హూందాతనం కనిపించిన ఎదుటి వ్యక్తి మనసులో భయానక వాతావరణంను సృష్టిస్తోంది. దీనిని జెనియో ఫోబియా అంటారు.
స్మార్ట్ ఫోన్ పని చేయదనే భయం
అధునిక కాలంలో ఫోన్ చాలా కామన్. కానీ ఇటీవలి కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీన్ని వాడడంలో కూడా చాలా మంది భయపడిపోతారు. ఎందుకంటే అవసరమైన సమయంలో ముఖ్యంగా టెన్షన్‌గా ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్ పని చేయదనే భయం కలుగుతుంది. దీనిని నోమోఫోబియా అంటారు.
శిలీంధ్రాల భయం
పుట్టగొడుగులతో కూరలు స్పైసీ వంటకాలు చేసుకుంటాము కొంతమంది వాటిని చూస్తే కూడా భయపడిపోతారు. అలాంటివారికి ఉండే భయాన్ని మైకోఫోబియా అంటారు.
నాభి భయం
కొంత మంది మనుషుల నాభి చూస్తే భయమేస్తుంది. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ కే. రాఘవేంద్ర రావు ఎక్కువగా తన తీసిన సినిమాలోని పాటల్లో ఎక్కువగా నాభి వద్ద పండ్లు వేసే సీన్లు ఉంచుతారు. అయితే నాభిని చూసి భయపడేవారిని ఓంఫోబియా అంటారు.
అత్తగారి భయం
ప్రాచీన భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. అలాంటి కుటుంబాల్లో కుటుంబ పెద్దగా యజమాని ఆ తర్వాత ఆయన భార్య వ్యవహరిస్తారు. అలాంటి ఇంట్లో ఉండే పిల్లల భార్యలకు అత్తలంటే భయపడిపోతారు. అలాంటి భయాన్ని పెంటెరాఫోబియా అంటారు.
ఇవి కూడా చదవండి…
తెలంగాణలో జనసేన.. ప్రభావమెంతా ?
హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్..ఎందుకంటే?
మసాలా టీ తాగితే.. ఎమౌతుందో తెలుసా ?