- Advertisement -
నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో వజ్రాల వేటలో బిజీగా మారిపోయారు ప్రజలు. వజ్రాలు దొరుకుతున్నాయని వదంతులు వ్యాపించడంతో ప్రజలు పెద్ద ఎత్తున వజ్రాల కోసం వేట మొదలుపెట్టారు.
మహానంది – శిరివెళ్ల సరిహద్దుల్లో వాగులు , వాగుల కట్టల వద్ద వజ్రాల వేట ఉధృతంగా కొనసాగుతోంది. తెల్లవారుజామునే వజ్రాల కోసం దూర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున చేరుతున్నారు.
ఇటీవల ఈ ప్రాంతంలో చిన్న చిన్న వజ్రాలు దొరికినట్లు వార్తలు రావడంతో వజ్రాల వేట మరింత వేగం అందుకుంది. మహిళలు, యువకులు, వృద్ధులు ఇలా అందరూ వజ్రాల ఆశతో వాగుల్లో గుంపులుగా కనిపిస్తున్నారు.
Also Read:దుల్కర్ సల్మాన్.. ‘కాంత’
- Advertisement -

