సైరా నరసింహరెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రం దర్శకుడు కొరటాల శివతో చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో షూటింగ్ ప్రారంభంకానుండగా దసరా కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు.
ఈ సినిమా గురించి అనౌన్స్ వచ్చిన దగ్గరి నుంచి రోజుకో వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించనున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. గతంలో వీరిద్దరు బిల్లా రంగా, పట్నం వచ్చిన పతివ్రతలు చిత్రాలలో హీరోలుగా కలిసి నటించారు. చాలా ఏళ్ళ తర్వాత మళ్లీ వీరిద్దరు కలిసి వెండితెరపై సందడి చేస్తున్నారనే వార్త టీ టౌన్‌లో ఆసక్తికరంగా మారింది.
చిరు సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దాదాపు 140 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చిరు దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.