మధుమేహాన్ని గుర్తించే లక్షణాలు ఇవే!

18
- Advertisement -

నేటి రోజుల్లో ఎక్కువమంది ఎదుర్కొనే ప్రధాన ఆరోగ్య సమస్య మధుమేహం బారిన పడడం, ప్రతి పది మందిలో కనీసం ఇద్దరు మధుమేహంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీని బారిన పడ్డామనే అవగాహన లేకపోవడంతో దీని తీవ్రత పెరిగి మరిన్ని రోగాలకు దారి తీస్తోంది. మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో డయాబెటిస్ తీవ్రత పెరుగుతోంది. కాగా దీని లక్షణాలు ఎలాంటివో కొందరిలో కనీసపు అవగాహన కూడా ఉండదు. కాబట్టి డయాబెటిస్ లక్షణాలను గుర్తిస్తే ఈ వ్యాధిని మొదటి నుంచే నివారించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిఒక్కరు తెలుసుకోవాల్సిన మధుమేహ వ్యాధి లక్షణాలను తెలుసుకుందాం !

మధుమేహం ఉన్నవారిలో రక్తం లో చక్కెర స్థాయిలో పెరుగుతుంది. అందువల్ల రక్తనాళాలు దెబ్బతిని గుండెకు రక్త ప్రసరణ సరిగా జరగదు. తద్వారా గుండె సమస్యలు ఏర్పడతాయి. ఇంకా మధుమేహం కారణంగా నాడీ వ్యవస్థ దెబ్బ తింటుంది. దాంతో మెదడు నుంచి శరీర భాగాలకు వెళ్ళే సంకేతాల్లో సమస్యలు ఏర్పడతాయి. ఇంకా శరీరంలో వేడి కండరాల తిమ్మిర్లు, మోకాళ్ళ నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా డయాబెటిస్ కారణంగా నేఫ్రోపతి అనే వ్యాధికి దారితీస్తుంది. దీని వల్ల తరచూ మూత్ర విసర్జన చేయడం, పాదాలు, కీళ్ళు, చేతులు, కళ్ళలో వాపులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి మధుమేహం బారిన పడితే ఎన్నో వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం కూడా పొంచి ఉంది. అందుకే చక్కెర వ్యాధిపై నిర్లక్ష్యం చేయరాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మధుమేహం బారిన పదకుండా ఉండాలంటే శరీరక శ్రమ చాలా అవసరం. అందుకే ప్రతిరోజూ వ్యాయమానికి సమయం కేటాయించాలి. తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచుకోవాలి. వైద్యులు సూచించిన ఆహార నియమాలను తప్పని సరిగా పాటించాలి. మద్యపానం ధూమపానం వంటి అలవాట్లను మనుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపు చేయవచ్చు.

Also Read:చంద్రముఖి 2…అందరికీ నచ్చుతుంది 

- Advertisement -