రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. 2025లో విడుదలైన సినిమాల్లో అతి పెద్ద బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా నిలుస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విడుదలైన మొదటి వారం రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన ఈ సినిమా, రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
సినిమా విడుదలై కేవలం ఎనిమిది రోజులు మాత్రమే గడిచినా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే మరో కీలక మైలురాయిని చేరుకుంది. బలమైన పాజిటివ్ టాక్, థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు, సీక్వెల్‌పై పెరుగుతున్న అంచనాలతో సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. డే 8 ముగిసే సరికి దేశీయ బాక్సాఫీస్‌లో రూ.239.25 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి, త్వరలోనే రూ.250 కోట్ల మార్క్‌ను దాటే దిశగా దూసుకెళ్తోంది.
ప్రముఖ ఇండస్ట్రీ ట్రాకర్ సాక్‌నిల్‌క్ ప్రకారం, శుక్రవారం (డే 8) నాడు ఈ సినిమా సుమారు రూ.32 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇది గత రోజుతో పోలిస్తే దాదాపు 18.5 శాతం వృద్ధి కావడం విశేషం. దీంతో భారతదేశంలో మొత్తం నెట్ కలెక్షన్ రూ.239.25 కోట్లకు చేరింది. హిందీ వెర్షన్‌లో శుక్రవారం మొత్తం ఆక్యుపెన్సీ 45.81 శాతంగా నమోదైంది. ఉదయపు షోల్లో 19.64 శాతం మాత్రమే ఉండగా, మధ్యాహ్నం షోల్లో 37.37 శాతం, సాయంత్రం షోల్లో 53.08 శాతం, రాత్రి షోల్లో ఏకంగా 73.16 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
ఇప్పటికే బాజీరావ్ మస్తానీ (రూ.184.3 కోట్లు), రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ (రూ.153.55 కోట్లు) చిత్రాల లైఫ్‌టైమ్ కలెక్షన్లను దాటేసింది. ప్రస్తుతం రూ.240.3 కోట్ల వసూళ్లు సాధించిన ‘సింబా’ రికార్డును అధిగమించే దశలో ధరుంధర్ ఉంది. రన్వీర్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం అయిన ‘పద్మావత్’ (రూ.302.15 కోట్లు) కు కూడా ‘ధురంధర్’ క్రమంగా దగ్గర అవుతోంది. ఈ జోరు కొనసాగితే త్వరలోనే రన్వీర్ సింగ్ కెరీర్‌లో నంబర్ వన్ గ్రాసర్‌గా నిలిచే అవకాశం కనిపిస్తోంది.
Also Read:Messi: కోల్‌కతాలో మెస్సీ

