బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ధురంధర్’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తాజాగా నార్త్ అమెరికా బాక్సాఫీస్‌లో ఈ సినిమా ఓ సంచలన రికార్డు నెలకొల్పింది. ‘బాహుబలి–2’ రికార్డును ‘ధురంధర్’ అధిగమించింది.
తాజా సమాచారం ప్రకారం, నార్త్ అమెరికాలో రెండో శుక్రవారం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ‘ధురంధర్’ నిలిచింది. గతంలో ‘బాహుబలి–2’ రెండో శుక్రవారం రోజున 828 వేల డాలర్లు వసూలు చేయగా, ‘ధురంధర్’ ఇప్పటికే 830 వేల డాలర్లకు పైగా వసూలు చేసి కొత్త రికార్డు సృష్టించింది.
నార్త్ అమెరికాలో కేవలం 8 రోజుల థియేట్రికల్ ప్రయాణంలోనే ఈ సినిమా ఏకంగా 5.25 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ‘ధురంధర్’ సినిమా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇందులో దేశీయ బాక్సాఫీస్‌లో మాత్రమే రూ.250 కోట్ల నెట్ వసూలు చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం భారతదేశంలో రూ.500 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తోంది. రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో మరో భారీ మైలురాయిగా ‘ధురంధర్’ నిలుస్తోంది.
Also read:గురుకుల విద్యార్థుల ప్రాణాలంటే లెక్కలేదా?

