లండన్‌కు ధోనీ.. ఎందుకో తెలుసా?

38
- Advertisement -

ఐపీఎల్ 2024 తుది అంకానికి చేరుకుంది. ఇవాళ జరిగే ఫస్ట్ క్వాలిఫైయర్‌లో కోల్‌కతాతో తలపడనుంది సన్ రైజర్స్. ఇక ఈసారి సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ రేసు నుండి తప్పుకుంది చెన్నై. ఇక ఐపీఎల్ నుండి చెన్నై నిష్క్రమించడంతో ధోనీ కండరాల గాయం చికిత్స కోసం లండన్ పర్యటనకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ గాయం నుంచి కోలుకున్న తర్వాత ధోనీ తన భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేయనున్నారు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో కనిపించకపోవడం ఇది మూడోసారి మాత్రమే. లండన్‌లో శస్త్ర చికిత్స చేసిన తర్వాతే ధోనీ రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తోంది.

Also Read:తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి..

- Advertisement -