చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయి ఫ్రాక్చర్ కావడంతో మిగతా IPL 2025 సీజన్‌కి దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోనీ CSK కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. గతంలో ధోనీ నేతృత్వంలో CSK ఐదుసార్లు (2010, 2011, 2018, 2021, 2023) IPL ట్రోఫీ గెలిచింది.హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.
రుతురాజ్ గైక్వాడ్ మోచేయి ఫ్రాక్చర్ కారణంగా IPL నుంచి తప్పుకున్నాడు. మిగితా మ్యాచ్‌లకు ధోనీ కెప్టెన్సీ బాధ్యతలు చేపడతాడు అని ఫ్లెమింగ్ పేర్కొన్నారు.
ధోనీ ఇప్పటివరకు CSK తరఫున 235 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఐదు టైటిల్స్‌ను కూడా గెలిపించాడు.
Also Read:పోసానికి మరో కేసులో రిలీఫ్..
ప్రస్తుతం CSK పాయింట్స్ టేబుల్‌లో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక విజయం మాత్రమే అందుకుంది.

