ధావన్…ప్రేమ్ కహానీ

274
ayesha dhawan
- Advertisement -

భారత క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌, అతని భార్య ఆయేషా ముఖర్జీ వీరిద్దరిరి అన్యోన్యమైన జంట.బాక్సింగ్ క్రీడాకారిణి అయిన ఆయేషా మొదటిభర్తకు విడాకులిచ్చి ధావన్‌ను పెళ్లి చేసుకుంది. ఫేస్ బుక్‌ ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. తనకంటే 12 ఏళ్ల పెద్దయిన ఆయేషా అందానికి శిఖర్‌ ధావన్‌ ఫిదా అయ్యాడు. ఆ పరిచయం కాస్తా పెళ్లికి దారితీసింది. ఈ నేపథ్యంలో మిస్ ఫీల్డ్ ఎస్‌1ఈ1 అనే కార్యక్రమంలో తన ప్రేమ కహానీని వివరించింది అయేషా.

నా ఫేస్ బుక్‌లో చాలామంది సీనియర్ క్రికెటర్లు స్నేహితులుగా ఉన్నారని తెలిపింది. క్రికెట్ అంటే తనకు పిచ్చి అని ధావన్ తొలుత ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడని తెలిపారు. ముందు తాను ఓకే చేయలేదని తర్వాత యాక్సెప్ట్ చేశానని తెలిపింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకే చేసిన ఐదు నిమిషాల్లోనే చాటింగ్ చేయడం మొదలుపెట్టాడని చెప్పింది. ఆ తర్వాత తామిద్దరం దగ్గరయ్యామని చెప్పుకొచ్చింది. జొరావర్‌ సింగ్‌కు జన్మనిస్తున్నప్పుడు టీవీలో శిఖర్‌ ధావన్‌ బ్యాటింగ్‌ చూస్తున్నా. జొరా పుట్టిన నాలుగు రోజులకు ధావన్‌ అతడిని చూసి భావోద్వేగానికి గురయ్యాడని తెలిపింది.

ayesha dawan

ఆయేషా ప్రొఫెషనల్‌ బాక్సర్‌. ఎంగేజ్‌మెంట్‌ 2009లో జరిగినా, క్రికెట్‌లో నిలదొక్కకునేవరకూ పెళ్లికి దూరంగా ఉండాలనుకున్నాడు ధావన్‌. చివరకు 2012లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

- Advertisement -