“మారి2″ను సొంతం చేసుకున్న ఐకాన్ మూవీస్‌..

265
Maari 2
- Advertisement -

ధ‌నుష్ హీరోగా,సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించిన లెటెస్ట్‌ చిత్రం మారి2. ఈ చిత్రం మారికి సీక్వెల్‌గా వ‌స్తుంది. ఇప్ప‌టికే మారికి వున్న క్రేజ్ ఈ సీక్వెల్ మారి2కి మార్కెట్‌లో క్రేజ్‌ని తీసుకువ‌చ్చింది. మారి2 టీజ‌ర్స్‌, పోస్ట‌ర్స్‌కి,విడ‌దులయ్యిన సాంగ్స్‌కి సూప‌ర్‌ రెస్పాన్స్ రావ‌టంతో ఫ్యాన్సిరేట్ల‌కే బ‌య్య‌ర్స్ కొనుగోలు చేయ‌టం విశేషం. ఈ చిత్రాన్ని ఆంధ్రా, సీడెడ్ హ‌క్కుల‌ని ప్ర‌ముఖ నిర్మాత‌ ఐకాన్ మూవీస్ అదినేత శ్రీరామ్ సొంత చేసుకున్నారు.

Maari 2

 

ఈ చిత్రాన్ని డి.ప్ర‌తాప్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో, ధ‌నుష్ నిర్మాత‌గా బాలీజీ మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబ‌ర్ 21న గ్రాండ్‌గా విడుద‌ల అవుతుంది. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మారి2లో ఓ సాంగ్‌ని ప్ర‌ముఖ మ్యూజిక్ ద‌ర్శ‌కుడు లెజెండ్ ఇల‌య‌రాజా పాడ‌గా, హీరో ధ‌నుష్ లిరిక్స్ అందించారు. అలాగే ఓ సాంగ్‌ని ఇండియ‌న్ మైఖెల్ జాక్స‌న్ ప్రభుదేవా కొరియోగ్రఫి చేయ‌టం విశేషం. ఈ సాంగ్ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది.

Maari 2

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌, హీరో ధ‌నుష్ మాట్లాడుతూ.. మారి చిత్రం చాలా పెద్ద స‌క్సస్‌ని సాధించింది. ఇప్ప‌డు దానికి సీక్వెల్‌గా మారి2ని విడుద‌ల చేస్తున్నాము. డిసెంబ‌ర్ 21న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న ఈ చిత్రానికి సంభందించిన టీజ‌ర్స్ , పోస్ట‌ర్స్, సాంగ్స్‌ త‌మిళ‌, తెలుగు ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి.. త‌ప్ప‌కుండా ఈ చిత్రం అంద‌ర్ని అక‌ట్టుకుంటుంది. ఇళ‌య‌రాజా ఒక పాట పాడ‌టం చాలా ఆనందంగా వుంది. అలాగే ప్రభుదేవా కొరిగ్ర‌ఫి అందించ‌టం కూడా చాలా ఆనందంగా వుంది.. అని అన్నారు.

Maari 2

న‌టీన‌టులుః ధ‌నుష్‌, సాయిప‌ల్లవి, కృష్ణకుల‌శేఖ‌ర్‌, వ‌ర‌ల‌క్ష్మిశ‌ర‌త్‌కుమార్‌, టోవినో థామ‌స్‌, రోబో శంక‌ర్‌, వినోద్, మ‌నోబాలా, ఆడుకాల‌మ్ న‌రేన్ త‌దిత‌రులు న‌టించారు..ఆంధ్ర‌, సీడెడ్‌ పంపిణిదారులు.. ఐకాన్ మూవీస్‌(శ్రీరామ్), స‌మ‌ర్ప‌కులు.. డి.ప్ర‌తాప్ రాజు, మాట‌లు, పాట‌లుః సామ్రాట్, కొరియో గ్రాఫ‌ర్స్ ..బాబాభాస్క‌ర్‌, జానీ, స్టంట్స్ఃసిల్వా, ఎడిట‌ర్ః ప్ర‌స‌న్న జి.కె., డైరెక్ట‌ర్ ఆఫ్ ఫొటోగ్ర‌ఫీః ఓం ప్ర‌కాష్‌, పి.ఆర్‌.ఓ.. ఏలూరు శ్రీను, సంగీతం: యువ‌న్‌ శంక‌ర్‌రాజా, నిర్మాతః ధ‌నుష్‌, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం:బాలాజీ మోహ‌న్‌.

- Advertisement -