ధనుష్ పుట్టుమచ్చలు ఏమయ్యాయి..?

242
Dhanush has no mole/scar, medical report goes against couple's claim
- Advertisement -

రజనీకాంత్ అల్లుడు, తమిళ స్టార్‌ హీరో ధనుష్, తన శరీరంపై పుట్టుమచ్చలను చెరిపేశారని, వైద్యులు కోర్టుకు సంచలన నివేదిక ఇచ్చారు. పుట్టుమచ్చలను చెరపడానికి ఆధునిక వైద్యం ఉపయోగించుకున్నాడని ఈ నివేదికలో పేర్కోన్నారు. ధనుష్ తమ కుమారుడేనని, తమిళనాడులోని మధురై ప్రాంతానికి చెందిన కదిరేశన్, మీనాక్షీ దంపతులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసును విచారించిన కోర్టు స్కూల్ సర్టిఫికెట్లను సమర్పించాలని ఆదేశించింది. ఆ మేరకు సర్టిఫికెట్ కాపీలను ధనుష్ న్యాయవాది ఇటీవల కోర్టుకు సమర్పించారు. అయితే కధిరేశన్ దంపతులు కోర్టులో ప్రవేశపెట్టిన టీసీలో పుట్టు మచ్చలు పేర్కొన్నట్లు ఉండగా, ధనుష్ తరఫు లాయర్ సమర్పించిన టీసీలో పుట్టు మచ్చలు పేర్కొనలేక పోవడం గమనార్హం. దీంతో ధనుష్ పుట్టుమచ్చలు వెరిఫికేషన్ కోరకు ధనుష్ ఫిబ్రవరి 28న ధనుష్ మధురై కోర్టుకు హాజరయ్యారు.

Untitled-5 copy

కదిరేశన్ దంపతులు ధనుష్ తమ కుమారుడే అని, నెలకు 60 వేల భృతిని ధనుష్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అయితే ఇటీవల కోర్టుకి హాజరైన ధనుష్ కి పుట్టు మచ్చలకు సంబంధించిన పరీక్షలు జరిపిన వైద్యులు ఆ రిపోర్ట్స్ ని కోర్టు వారికి అందించారు. తాజాగా ఆ రిపోర్ట్స్ పరిశీలనకు రాగా, ధనుష్ శరీరంపై లేజర్ ద్వారా పుట్టుమచ్చలు తొలగించిన ఆనవాళ్లు ఉన్నాయని వైద్యులు తెలిపారు.

గతంలో కదిరేశన్ దంపతులు ధనుష్ యొక్క భుజపుటెముక మీద ఒక పుట్టుమచ్చ, మోచేతి మీద ఒక పెద్ద గుర్తు ఉన్నట్టు కోర్టుకు తెలిపారు. అయితే ధనుష్ తన శరీరంపై ఉన్న చిన్నపాటి పుట్టుమచ్చను లేజర్ ట్రీట్మెంట్ ద్వారా, పెద్ద మచ్చను ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తొలగించి ఉంటారని కదిరేశన్ దంపతులు చెబుతున్నట్టు సమాచారం. ఏదేమైన ఈ కేసు ధనుష్ ఫ్యామిలీతో పాటు అభిమానులను కొంత ఆందోళనకు గురి చేస్తుంది.

- Advertisement -