విడాకులు తీసుకున్న ధనుష్‌-ఐశ్వర్య

76
dhanush
- Advertisement -

కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్ – ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు. 18 ఏళ్ల వివాహ బంధానికి తెరదించుతూ విడిపోతున్నామని అధికారికంగా ప్రకటించారు. స్నేహితులుగా, భార్యాభర్తలు, శ్రేయోభిలాషులుగా 18 సంవత్సరాలుగా కలిసి ప్రయాణించాం. ఇప్పుడు మా దారులు వేర‌య్యాయి. వాటిలో ప్ర‌యాణించ‌డానికి సిద్ధ‌మ‌య్యాం. నేను, ఐశ్వ‌ర్య విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నాం. మా వ్య‌క్తిగ‌త స‌మ‌యాన్ని వెచ్చించాల‌ని నిర్ణ‌యించుకున్నాం. మా నిర్ణ‌యాన్ని గౌర‌వించండి. ఇలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవ‌డానికి గోప్య‌త అవ‌స‌రం. దాన్ని మాకు క‌ల్పించండి అని పేర్కొన్నారు.

సూపర్ స్టార్ రజనీ పెద్ద కూతురే ఐశ్వర్య. 2004 న‌వంబ‌ర్ 18న ధనుష్ – ఐశ్వర్య వివాహం జరిగింది. వీరికి యాత్ర‌, లింగ ఇద్ద‌రు కుమారులున్నారు. వీరిద్దరి షాకింగ్ నిర్ణయం అందరిని విస్మయానికి గురిచేసింది.

- Advertisement -