- Advertisement -
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీ ధమ్కీ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. విశ్వ క్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్-ఇండియన్ సినిమా ఫిబ్రవరి 17, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
కానీ డబ్బింగ్ పనులతో పాటు షూటింగ్ ఇంకా పూర్తి కానందున ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసే పనిలో ఉన్నాడని తెలుస్తుంది. ఈ సినిమా మార్చ్ కి వాయిదా పడే అవకాశం ఉందని తాజా సమాచారం. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
వన్మయ్ క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లు నిర్మించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ఆట్టుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి…
#OG పవన్ తో రెండు భాగాలా?
కీడా కోలా… కామెడీ కింగ్ బ్రహ్మానందం
మృణాల్ మజాకా.. పర్ఫెక్ట్ ప్లానింగ్
- Advertisement -