రవితేజ ఫ్యాన్స్‌కు ధమాకా!

165
rt
- Advertisement -

నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ధమాకా. ఇప్పటివరకు సినిమా నుండి వచ్చిన పోస్టర్‌, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ రాగా తాజాగా వినాయకచవితి సందర్భంగా ఓ రొమాంటిక్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసింది.

ఈ వీడియో గ్లింప్స్ నిజంగానే రొమాంటిక్ అండ్ కూల్‌గా ఉండటంతో ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. హీరోహీరోయిన్లు ఓ పెళ్లి మండపంలో ఉండగా, హీరో రవితేజ హీరోయిన్ శ్రీలీలా వైపు రొమాంటిక్‌గా చూస్తూ ఉంటాడు. తన కళ్లతో ఆమెకు సైగలు చేస్తూ పక్కకు వెళ్దామని చెబుతాడు. దానికి అమ్మడు ముందుగా నో చెబుతోంది.

దీంతో రవితేజ కన్నీరు పెట్టుకున్నట్లుగా తన ఎక్స్‌ప్రెషన్ మార్చేస్తాడు. దీంతో కరిగిపోయిన హీరోయిన్ సరే వస్తానంటూ సైగలు చేస్తుంది. మొత్తంగా రవితేజ మాస్‌ను పక్కనబెట్టి నాటీగా కనిపించడంతో ఫ్యాన్స్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.

- Advertisement -