దాడి….ఫస్ట్ లుక్

302
dhadi
- Advertisement -

గీతాంజలి కావ్యాన్ని, జాతీయ గీతాన్ని రచించిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనను స్మరించుకుంటు అదే భావాలతో ఒక వ్యవస్థని కథగా రాసుకొని తెరకెక్కిస్తున్న చిత్రం దాడి.

ఈ సందర్భంగా దర్శకుడు మధు శోభ.టి మాట్లాడుతూ…సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా దాడి చిత్రాన్ని రూపొందించడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. నిర్మాత శంకర్.ఏ గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా బాగా వస్తోంది, త్వరలో ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు తెలియజేస్తామన్నారు.

నటీనటులు: శ్రీరామ్, జీవన్, కమల్ కామరాజు, గణేష్ వెంకట రమణ, ముఖేష్ ఋషి, చరణ్ రాజ్, అజయ్ , అజయ్ రత్నం, నాగినీడు, అజయ్ ఘోష్, మధు, అలోక్, రాజా రవీంద్ర, సలీమ్ పాండ, దిల్ రమేష్, సితార

సాంకేతిక నిపుణులు:
నిర్మాత: శంకర్.ఏ
కథ- స్క్రీన్ ప్లే – డైలాగ్స్- డైరెక్షన్:మధు శోభ.టి
కెమెరామెన్: శ్యామ్. కె.నాయుడు
సంగీతం: మణిశర్మ
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
డాన్స్: రాజ సుందరం, శివ శంకర్, శేఖర్
స్టంట్స్: కనల్ కన్నన్, వెంకట్
లిరిక్స్: కాసర్ల శ్యామ్, భాష్య శ్రీ

- Advertisement -