లాక్ డౌన్ మరింత కఠినం: డీజీపీ మహేందర్ రెడ్డి

47
dgp

ఈ నెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు డీజీపీ మహేందర్ రెడ్డి.లాక్‌డౌన్‌ అమలుపై జోనల్ ఐజిలు, డిఐజిలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పిలతో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మే 30 వ తేదీ తరవాత తిరిగి లాక్‌డౌన్‌ను పొడగించేందుకు వీలులేకుండా ప్రస్తుత లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని తెలిపారు.

ఉదయం 6 గంటల నుంచి 10 గంట‌ల వరకు లాక్‌డౌన్‌ సడలింపు ఉన్నప్పటికీ 8 గంట‌ల‌ తర్వాతే ప్రజలు నిత్యావసరాలకై వస్తున్నందున మార్కెట్లు, దుకాణాల దగ్గర పెద్దఎత్తున ప్రజలు గుమికూడటం కనిపిస్తుందని, దీనిని నివారించేందుకు ఉదయం 6 గంట‌ల‌ నుంచే తమ అవసరాలకై వెళ్లేవిధంగా ప్రజలను చైతన్యపర్చాలని డీజీపీ సూచించారు.